Friday, September 12, 2025 08:52 PM
Friday, September 12, 2025 08:52 PM
roots

మరాఠా గడ్డపై థాక్రేల హగ్ సెన్సేషన్

మరాఠా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ళ తర్వాత దాయాదులు చేసుకున్న హగ్ మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. 20 ఏళ్ల రాజకీయ వైరం తర్వాత ఉద్ధవ్ ఠాక్రేతో వేదికను పంచుకున్నారు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే. వివాదాస్పద త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న ఉదావ్ థాకరే, రాజ్ థాకరే.. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ‘అవాజ్ మరాఠీ చా’ కార్యక్రమం విజయవంతం కావడంతో బహిరంగ సభ ఏర్పాటు చేసారు.

Also Read : తెలుగు సైనికుడి జీవిత కథతో సల్మాన్ సినిమా

ఈ సందర్భంగా రాజ్ థాకరే మాట్లాడుతూ బాల్ ఠాక్రే కూడా చేయలేనిది, చాలా మంది సాహసం చేయలేనిది దేవేంద్ర ఫద్నవీస్ చేసారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తమ ఇద్దరినీ కలిపారని, తాము కలిసే ఉంటామని స్పష్టం చేసారు. వీరి పోరాటంతో.. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో సహా ముంబై స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము కలిసి పని చేస్తామన్నారు.

Also Read : అదరగొట్టిన హైదరాబాద్ నవాబ్.. న్యూ బాల్ కింగ్

ఇటీవలి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ప్రకటన చాలా కీలకంగా మారింది. మరాఠీ భాష, గుర్తింపు కోసం గళం విప్పిన థాకరేలు.. చివరిసారిగా 2005లో ఓ వేదికపై కనిపించారు. ఆ సంవత్సరం రాజ్ థాకరే శివసేనను విడిచిపెట్టి 2006లో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనను స్థాపించారు. నాకు హిందీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు, ఏ భాష కూడా చెడ్డది కాదు. వారు మనపై హిందీని రుద్దే ప్రయోగంతో ప్రారంభించారని మండిపడ్డారు. మనం దానిని వ్యతిరేకించకపోతే, వారు ముంబైని మహారాష్ట్ర నుండి వేరు చేయడానికి కూడా రెడీ అవుతారన్నారు రాజ్ థాకరే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్