ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో రియల్ పాన్ ఇండియా అని ప్రూవ్ చేసుకున్న మ్యాన్ ఆఫ్ ది మాసేస్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండియాలో మార్కెట్ పెంచుకోవాలనుకోవడం ఎన్టీఆర్ కు ఖచ్చితంగా ప్లస్ అయ్యే సిగ్నల్స్ కనపడుతున్నాయి. తెలుగుతో పాటుగా కన్నడ మార్కెట్ పై కూడా పట్టున్న ఎన్టీఆర్ ను.. బాలీవుడ్ హీరోలు వాడుకునేందుకు రెడీ అయిపోయారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు.
Also Read : మళ్లీ ఎలా గెలుస్తావో నేను చూస్తా..!
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, ఎన్టీఆర్ లుక్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేసాయి. ఈ సినిమా షూట్ కంప్లీట్ కావడంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దేవర ఉండే అవకాశం ఉంది. ఇదే టైం లో బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ కు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. షారుఖ్ ఖాన్ హీరోగా రాబోతున్న పఠాన్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఓ కీ రోల్ చేయడానికి రెడీ అయినట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ బయటకు వచ్చింది.
Also Read : అదరగొట్టిన హైదరాబాద్ నవాబ్.. న్యూ బాల్ కింగ్
ఆ సినిమాలో ఎన్టీఆర్ పాజిటివ్ రోల్ చేయనున్నట్టు టాక్. 2027 సమ్మర్ లో దాదాపుగా ఆ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. వార్ 2 హిట్ అయితే బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు ఎన్టీఆర్ చేసే ఛాన్స్ ఉందనేది ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. త్వరలోనే వార్ 2 ప్రమోషన్స్ లో పాల్గొనే ఛాన్స్ కనపడుతోంది. ఇక తమిళ మార్కెట్ పై కూడా పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న యంగ్ టైగర్.. వెట్రిమారన్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిపొయింది.