ఆంధ్రప్రదేశ్ లో గంజాయి బ్యాచ్ కు చుక్కలు చూపిస్తున్నారు అధికారులు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్ లు, బస్ స్టాండ్ లు, జన సందోహం ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయి. గంజాయిని ఏ రూపంలో తరలించినా సరే గుర్తించి అరెస్ట్ లు చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో ఇప్పుడు గంజాయి గ్యాంగ్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో డ్రోన్ టీం లతోపాటు స్పెషల్ పార్టీ సిబ్బంది పాడుపడ్డ గృహాలు, పాడుపడ్డ భవనాల వద్ద రహస్యంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి సేవిస్తున్న వారిపై నిఘా పెట్టింది.
Also Read : కొనసా…గుతోన్న ఏసీబీ విచారణ..!
తిరుచునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాడుపడ్డ గృహాలు, పాడపడ్డా బంగ్లా వద్ద డ్రోన్ కెమెరాతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. నలుగురు యువకులు గంజాయి సేవిస్తున్న దృశ్యాలు కనపడటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిఘాలో ఓ వ్యక్తి అదే పాడుపడ్డా భవనం మెట్లు వద్ద కూర్చుని కనపడటంతో.. పక్కా ప్లాన్ తో అతనిని అదుపులోకి తీసుకుని 8 గంజాయి ప్యాకెట్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో అతనిది తమిళనాడు అని గుర్తించారు.
Also Read : ఇదెక్కడి గోల.. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ళల్లో బాంబులు
అంతే కాకుండా అతని పై గతంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులో న అరెస్ట్ చేసినట్లు పాత రికార్డ్ ఉన్నట్లుగా గుర్తించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరమ్మ గృహాల వద్ద నివాసముంటూ గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటల్ గ్రాండ్ రిడ్జ్ సమీపంలో ఉన్న పాడుబడ్డ భవనంను స్థావరంగా చేసుకుని అక్కడే విక్రయిస్తున్నారు. పాడుబడ్డ భవనం కు వచ్చేవారందరికి 20 గ్రాముల చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేసిన విక్రయిస్తున్నట్లు విచారణ లో గుర్తించారు. దీనితో తిరుపతిలో అసలు గంజాయి గ్యాంగ్ లు ఎన్ని ఉన్నాయనే దానిపై ఇప్పుడు ఆందోళన మొదలైంది. తిరుపతి రైల్వే స్టేషన్ లో కూడా గంజాయి విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.