Friday, September 12, 2025 11:26 PM
Friday, September 12, 2025 11:26 PM
roots

రేవంత్ రెడ్డి – ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సిట్

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ వ్యవహారం ఇప్పుడు క్రమంగా సాధారణ ప్రజలను కూడా కంగారు పెడుతోంది. వ్యాపారవేత్తలను, సినిమా వాళ్ళను కూడా ఉలిక్కిపడేలా చేసిన ఈ వ్యవహారంలో ఇప్పుడు సిట్ విచారణ వేగవంతం చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తమకు వ్యతిరేకంగా ఉన్న వారు, తమకు అనుమానం ఉన్న అందరి ఫోన్ లను సైతం ట్యాప్ చేసారు.

Also Read : మిడిల్ క్లాస్ కు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గే ధరలు ఇవే

మొత్తం 1670 మంది వివిధ రంగాల్లో ఉన్న వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు తేల్చారు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. 2023 నవంబర్ లో అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డితో మాట్లాడిన ఆరా మస్తాన్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసారని తేల్చారు. రేవంత్‌రెడ్డితో మాట్లాడిన కాల్స్‌ను ట్యాపింగ్ చేసిన ప్రభాకర్‌రావు టీమ్.. ఆ రికార్డింగ్ ను పెద్దలకు పంపినట్టు గుర్తించారు.

Also Read : సిఎం వర్సెస్ డిప్యూటి సిఎం.. కన్నడ నాట ఏం జరుగుతోంది..?

2023 సెప్టెంబర్ నుంచి ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. పలువురు రాజకీయ నేతలతో ఆరా మస్తాన్ మాట్లాడిన కాల్స్ సైతం ట్యాప్ చేసారు. 2020 నుంచి ఆరా మస్తాన్ ఫోన్‌పై ప్రభాకర్‌రావు టీమ్ నిఘా పెట్టింది. ఆరా మస్తాన్ ను 2 గంటలు ప్రశ్నించి వాంగ్మూలం రికార్డు చేసారు అధికారులు. ఆరా మస్తాన్‌కు వచ్చిన వందల కాల్స్ ట్యాప్ చేసి రికార్డ్ చేసినట్లు గుర్తించారు. విచారణలో ఆడియోలు, ట్యాప్ అయిన డేటాను చూపించిన సిట్.. వాటి ఆధారంగా ప్రశ్నలు అడిగింది.

సంబంధిత కథనాలు

1 COMMENT

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్