అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. రష్యా విషయంలో కఠిన వైఖరిని ప్రదర్శించింది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం విషయంలో సీరియస్ గా ఉన్న ట్రంప్.. రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న దేశాలకు భారీగా సుంకాలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కరోలినాకు చెందిన రిపబ్లికన్ అయిన అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఓ బిల్ ప్రవేశపెట్టారు.
Also Read : మాగుంటను ముంచేసిన కాకాని..?
భారత్, చైనాతో సహా రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాల వస్తువులపై 500 శాతం సుంకాలు విధించాలని పిలుపునిచ్చే ప్రతిపాదిత బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపారు. జులైలో సెలవలు పూర్తైన తర్వాత ఈ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారట. రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ కు సహాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సుంకాలు 500 శాతం విధిస్తామని గ్రాహం వార్నింగ్ ఇచ్చారు. మార్చిలో మొదట ప్రతిపాదించిన ఈ బిల్ ఆగస్ట్ లో ప్రవేశ పెట్టె అవకాశాలు ఉన్నాయి.
Also Read : ఏపీ జనసేన అధ్యక్షుడు కూడా త్వరలోనే
ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి మరియు వినియోగ దేశంగా ఉన్న భారత్.. విదేశాల నుండి సుమారు 5.1 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యా నుండి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యం నుంచి కూడా చమురు కొనుగోలును భారత్ తగ్గించింది. మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 1 శాతం కంటే తక్కువగా రష్యా నుంచి కొనుగోలు చేసేది భారత్. కాని స్వల్ప కాలంలోనే 40-44 శాతానికి పెరిగాయి.
Also Read : దుబారాలో పరాకాష్ట.. ఇదేందయ్యా..!
జూన్‌లో, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి కారణంగా మార్కెట్ అస్థిరత ఏర్పడిన నేపథ్యంలో, భారత్.. రష్యా నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లను పెంచింది. సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాల నుంచి వచ్చే చమురు కంటే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. జూన్‌లో రోజుకు 2-2.2 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసింది. దీనితో ట్రంప్ సుంకాల ప్రభావం భారత్ పై గట్టిగానే పడే అవకాశాలు ఉన్నాయి.