Saturday, September 13, 2025 03:19 AM
Saturday, September 13, 2025 03:19 AM
roots

మాగుంటను ముంచేసిన కాకాని..?

వైసీపీ మాజీ మంత్రి అవినీతి వ్యవహారాలపై రాష్ట్రప్రభుత్వం ఫోకస్ పెట్టిన తర్వాత సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో మీడియా ముందుకు వచ్చి నీతిమంతులుగా మాట్లాడిన మాజీ మంత్రులు ఇప్పుడు అవినీతి వ్యవహారాల్లో ఆధారాలతో సహా ఇరుక్కుపోవడంతో వైసిపి కూడా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి.. కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : వైసీపీ మైండ్ గేమ్.. వర్కవుట్ అవుతుందా..?

కాకాని గోవర్ధన్ రెడ్డి భూకబ్జాలకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. సర్వేపల్లి గ్రావెల్ అక్రమాల కేసులో అధికారులపై రిచర్యలకు సైతం రంగం సిద్ధం చేశారు. మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సహకరించి ఆక్రమాలకు పాల్పడిన అధికారులపై.. ఆధారాలతో సహా చర్యలకు సిద్ధమయ్యారు. గ్రావెల్ అక్రమాలకు అనుమతి ఇచ్చిన.. ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. సెంట్రల్ డివిజన్ ఈఈ కృష్ణమోహన్.. నెల్లూరు డిఈఈ పెంచలయ్య పై చర్యలకు రంగం సిద్ధం చేశారు.

Also Read : చంద్రబాబు, పవన్ అభిప్రాయం తర్వాతే బిజెపి ఆ నిర్ణయం..?

ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్లు సమాచారం. గ్రావెల్ అక్రమాల కేసులో బ్రహ్మదేవి సెక్షన్ ఈ ఈ ప్రసాద్ పై కూడా చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. క్రమశిక్షణ చర్యలకు ముగ్గురైన ముగ్గురు అధికారులకు భారీగా జరిమానా విధించే అవకాశాలు కనబడుతున్నాయి. ముగ్గురుపై చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ ప్రత్యేకత కార్యదర్శి సాయి ఆదేశాలు ఇచ్చారు. ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రావెల్ తవ్వకాలకు వైసీపీ నేతలు దరఖాస్తు చేశారని గుర్తించారు. గ్రావెల్ అక్రమాల కేసులో ప్రధాన నిందితుడుగా వైసిపి నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్