Friday, September 12, 2025 06:47 PM
Friday, September 12, 2025 06:47 PM
roots

ఆ నలుగురికి చంద్రబాబు మాస్ వార్నింగ్..!

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. సుపరిపాలన పేరుతో అమరావతిలో పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇక ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో చంద్రబాబు విస్తృత స్థాయి నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశంతో పాటు ఏడాది పాటు ప్రభుత్వం సాధించిన ఘనత కూడా వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ పని తీరు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై పలు ప్రైవేటు సంస్థలు కూడా చేసిన సర్వే రిపోర్టులు కూడా వచ్చాయి. వీటిపై కూడా చంద్రబాబు విస్తృతస్థాయి సమావేశంలో చర్చించారు.

Also Read : అదరగొడుతున్న పెమ్మసాని స్పీచ్ లు

మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి సుమారు 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీళ్లు చెప్పిన కారణాలపై మంత్రి నారా లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మరోసారి చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు కూడా. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా చంద్రబాబు చర్చించారు. జూలై 2వ తేదీ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఇప్పటికే పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లాలని.. ఆ ఫోటోలను ఆయా నియోజకవర్గం గ్రూప్‌లో అప్ లోడ్ చేయాలని కూడా ఆదేశించారు.

Also Read : మహా న్యూస్ పై దాడి వెనుక వైసీపీ హస్తం..?

ఇక విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాను నలుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు వెల్లడించారు. పని తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కూడా తేల్చేశారు. తాజా సర్వేల్లో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, సేఫ్ జోన్ అని డివైడ్ చేశారు చంద్రబాబు. రెడ్ జోన్‌లో సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి విషయంలో చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. కానీ వీరి కంటే ముందు ఆరెంజ్ జోన్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబు వన్ టూ వన్ నిర్వహించారు. ఆ నలుగురు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే మొత్తముల అశోక్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజేశేఖర్ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష. వీరిలో శిరీష మాత్రమే కొత్తగా ఎన్నికయ్యారు. మిగిలిన ముగ్గురు సీనియర్లే.

Also Read : వైసీపీ క్యూఆర్ కోడ్.. జర భద్రం గురూ..!

ఈ నలుగురిలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీరుపై గతంలో కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన మార్కాపురంలో పర్యటించిన సమయంలో బహిరంగ వేదికపైనే చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పని తీరు మార్చుకోవాలంటూ ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని సున్నితంగా హెచ్చరించారు. ఇలాగే ఉంటామంటే కష్టమన్నారు కూడా. మిరియాల శిరీషకు మాత్రం.. కొన్ని జాగ్రత్తలు చెప్పారు. కొత్తగా ఎన్నికయ్యావు కాబట్టి.. ఇంకా విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అయితే ముగ్గురు సీనియర్లతో చంద్రబాబు వన్ టూ వన్ వివరాలు బయటకు రావడంతో.. మిగిలిన నేతలు భయపడుతున్నారు. రెడ్ జోన్‌లో ఉన్న వారిని ఎందుకు పిలవలేదని కూడా మదనపడుతున్నారు. మొత్తానికి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అంశం.. పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్