మేము అధికారంలోకి వస్తాం.. మరో మూడేళ్ల లోనే ఎన్నికలు.. ప్రజలు మళ్లీ మాకు అవకాశం ఇస్తారు.. ఇవీ తరచూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మాట. ఏ పార్టీ నేత అయినా సరే.. తమ కార్యకర్తలకు ఇదే భరోసా ఇస్తారు. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏం చేస్తారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం తెలిస్తే.. అంతా షాక్ అవుతున్నారు. సాధారణంగా ఎవరైనా సరే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇది చేస్తాం.. ఆ పథకాలు అమలు చేస్తామని హామీలిస్తారు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనే ప్రశ్నకు వాళ్లు చెప్పే జవాబు వెంటే.. వామ్మో.. అనాల్సిందే. ఇంకా చెప్పాలంటే.. అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆగలేరట.. జస్ట్ ఫలితాలు వచ్చే రోజు నుంచే తమ పని మొదలవుతుందట.. అది కూడా.. రిజల్ట్ పూర్తిగా వచ్చే వరకు ఆగేది లేదంట.. ఆపుకో లేరంట.. ఎలక్షన్ ట్యాలీలో వైసీపీకి 80 స్థానాలు అనే అంకె పడిన వెంటనే తాము చేయాలనుకున్న పని చేస్తారంట. ఇంతకీ వాళ్లు ఏం చేస్తామంటున్నారో తెలుసా.. అదే రప్పా రప్పా..
Also Read : వివేకా కేసులో మరో నిందితుడ్ని లేపెయడానికి ప్లాన్..?
2019 ఎన్నికలప్పుడు పాదయాత్ర చేసిన జగన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఓట్లు అడిగారు. రాజన్న రాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ గొప్పగా చెప్పారు. పాపం ప్రజలు కూడా.. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు. ఇక అంతే.. చేయని అరాచకం లేదు.. జరగని అవినీతి లేదు.. ఇక బరితెగింపు, దౌర్జన్యం.. ఇవి అయితే సర్వ సాధారణం. సొంత స్థలంలో ఎన్టీఆర్ బొమ్మ పెట్టినందుకు నడి రోడ్డు మీద చంద్రయ్య అనే కార్యకర్త గొంతు కోసి హత్య చేశారు. జై అమరావతి అన్నందుకు మహిళలపై దాడులు చేశారు. చివరికి నాటి ప్రతిపక్షనేతపై చెప్పులు కూడా విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టారు. అది పాత్రికేయులైనా సరే.. వయోవృద్ధులైనా సరే.. ముందు కేసు పెట్టడమే.. ఇక మహిళలపై దాడులు, అవినీతి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు… అవి లెక్క లేనన్ని ఉన్నాయి. అభివృద్ధి అనే మాటే లేదు. అంతా శూన్యమే. కంపెనీలను రానివ్వలేదు. పారిశ్రామికవేత్తలను బెదిరించారు. పరిశ్రమలను రాకుండా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయినా సరే.. బటన్ నొక్కాను కాబట్టి.. నాకే అంతా ఓటు వేస్తారు.. మళ్లీ అధికారంలోకి వస్తా అని గొప్పగా చెప్పుకున్నారు. పైగా వై నాట్ 175 అని పదే పదే చెప్పారు కూడా.
Also Read : రాహుల్ బెర్త్ ఖరారు.. సెంచరీతో ప్రమోషన్ పక్కా..!
అయితే ఏపీ ప్రజలు మాత్రం.. వై 175.. జస్ట్ 11.. ఓటుతో తీర్పు ఇచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో అసెంబ్లీకి కూడా జగన్ రావటం లేదు. అయితే ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన వారిని, లిక్కర్, మైనింగ్, శాండ్ మాఫియా చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు పోలీసులు. దీంతో వైసీపీ నేతల్లో అసహనం తారాస్థాయికి చేరుకుంది. చివరికి జగన్ పర్యటన సమయంలో నిరసన తెలిసిన మహిళలపై రాళ్ల దాడి చేశారు. అంతటితో సరిపోదు అన్నట్లు పల్నాడు జిల్లా పర్యటనలో అయితే రప్పా రప్పా అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సైకోలపై కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఇలా చేయడమే తప్పు అంటారు వైసీపీ నేతలు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read : రెండు సెంచరీలు.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన పంత్
ఎన్నికల ఫలితాల రోజున మ్యాజిక్ ఫిగర్ 80 దాటిన వెంటనే.. తెలుగుదేశం నాయకులు ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందే అంటూ బెదిరిస్తున్నారు. అలా చేయకపోతే.. తర్వాత జరిగే పరిణామాలకు మాది బాధ్యత కాదు.. అంటున్నారు కూడా. అంటే.. మేము అధికారంలోకి వస్తే.. మీ ప్రాణాలు తీస్తామని ముందే బెదిరిస్తున్నారు వైసీపీ నేతలు. రప్పా రప్పా నరుకుతామంటున్నారు అంటే.. మంచిదేగా అని అధినేత జగన్ కూడా సమర్థిస్తున్నారు. అందుకే యధా రాజా తథా ప్రజా అంటారు ప్రజలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతలపై చర్యలు తీసుకున్న పోలీసుల బట్టలూడదీస్తాం.. మీ సంగతి తేలుస్తాం.. జాగ్రత్త.. అంటూ జగన్ బెదిరిస్తున్నారు. ఇదే మాటను పదే పదే చెబుతున్నారు కూడా. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన కంటే.. కక్ష సాధింపు, అరాచకాలు, అక్రమాలు, దాడులు, హత్యలు తప్పవని స్వయంగా జగన్ చెబుతున్నారు. కాబట్టే ఆ పార్టీ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. ఇలాంటి వారికి ప్రజలు మళ్లీ ఓట్లు ఎలా వేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇలా హింసను ప్రొత్సహించే నాయకుడిని ఆదర్శంగా తీసుకున్న నాయకులు, కార్యకర్తల గురించి ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచక, విధ్వంసక పాలనకు పనిష్‌మెంట్‌గా 11 స్థానాలు వచ్చాయి. ఈ సారి ఆ 11 కూడా పోయ్యి.. ఒక్కటే మిగులుతుందేమో.. అని ఏపీ ఓటర్లు సెటైర్లు వేస్తున్నారు.