Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

రెండు సెంచరీలు.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన పంత్

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న తొలి టెస్ట్ లో భారత్ రెండో ఇన్నింగ్స్ లో దుమ్ము రేపింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడగా అక్కడి నుంచి.. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ జోడి ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. ఇంగ్లాండ్ లో మంచి అనుభవం ఉన్న ఈ జోడీ.. పిచ్ ఎంత కఠినంగా ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టింది. మొదటి సెషన్ లో గిల్ వికెట్ కోల్పోయిన తర్వాత పిచ్ మరింత ఇబ్బందిగా మారింది.

Also Read : క్యాచ్ కాదు మ్యాచ్ వదిలేసాడు.. జైస్వాల్ ముంచేసాడా..?

అయినా సరే పంత్, రాహుల్ జోడీ మాత్రం గోడ కట్టేసింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా పంత్ సరికొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. హెడింగ్లీ టెస్ట్‌లో నాల్గవ రోజున ఇంగ్లాండ్‌పై 118 పరుగులు చేసి రిషబ్ పంత్.. అంతర్జాతీయంగా రెండవ స్థానంలో నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేశాడు. జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ మొదటి స్థానంలో ఉన్నాడు.

Also Read : వివేకా కేసులో మరో నిందితుడ్ని లేపెయడానికి ప్లాన్..?

అతను 2001లో హరారేలో దక్షిణాఫ్రికాపై 141, 199(నాటౌట్) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా పంత్ నిలిచాడు. ఇలా ఇంగ్లాండ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసిన తొమ్మిదవ విదేశీ బ్యాట్స్‌మన్. హెడింగ్లీ టెస్ట్‌లో భారత్ తరుపున మొత్తం 5 సెంచరీలు నమోదు అయ్యాయి. మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, పంత్ సెంచరీ చేయగా రెండవ ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, పంత్ సెంచరీలు చేసారు.

Also Read : సేనాలో ది బెస్ట్.. బూమ్రా సరికొత్త రికార్డులు

భారత్ ఒక టెస్ట్‌లో ఐదు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. 1955లో జమైకాలో జరిగిన ఒక టెస్ట్‌లో ఆస్ట్రేలియా మాత్రమే ఐదు సెంచరీలు చేసింది. హెడింగ్లీలో జరిగిన రెండు ఇన్నింగ్స్‌లలో పంత్ చేసిన 252 పరుగులు కాగా.. ఒక టెస్ట్‌లో ఒక భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. 1964లో చెన్నైలో ఇంగ్లాండ్‌పై బుధి కుందెరన్ చేసిన 230 పరుగుల రికార్డ్ ను పంత్ బ్రేక్ చేసాడు. ఇంగ్లాండ్ లో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ వికెట్ కీపర్ పంత్. ఈ మ్యాచ్ లో పంత్ 9 సిక్సులు బాదాడు. ఈ రికార్డ్ సాధించిన తొలి విదేశీ ఆటగాడు కూడా పంత్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్