భారతదేశ చరిత్రలో అత్యంత ఘోర విషాదంగా మిగిలిపోయిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సరిగా 8 రోజుల క్రితం.. అంటే జూన్ 12న అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన 36 సెకన్ల తర్వాత కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం AI-171 శిథిలాల నుండి బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్లాక్ బాక్స్ యూనిట్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. బ్లాక్ బాక్స్ లలో ఒకటి ఎక్కువగా దెబ్బ తిన్నట్టు వెల్లడించారు.
Also Read : యోగాంధ్ర.. ఏపీ బ్రాండ్.. రికార్డుల మోత..!
ఇది క్రాష్ సమయంలో జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) లను సమిష్టిగా “బ్లాక్ బాక్స్ లు” అని పిలుస్తారు. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పర్యవేక్షణలో కస్టడీలో ఉన్నాయి. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం.. బయట బ్లాక్ బాక్స్ దెబ్బ తిన్నదని.. దీన్ని జాగ్రత్తగా ఉంచకపోతే లోపల ఉన్న డేటా దెబ్బ తినే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే నిపుణుల పర్యవేక్షణలో ఉంచినట్టు వెల్లడించారు.
Also Read : పాకిస్తాన్ కు బాగా తెలుసు.. ట్రంప్ సంచలన కామెంట్స్
రెండు బ్లాక్ బాక్స్ యూనిట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు.. అక్కడి నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు. బ్లాక్ బాక్స్‌లను ఏమి చేయాలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాటిని విదేశాలకు పంపించే అవకాశం ఉందని జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ లను లక్నో సమీపంలోని హెచ్ ఏఎల్ సర్వీస్ సెంటర్ కు లేదా అమెరికాలోని NTSBకి, యునైటెడ్ కింగ్‌డమ్ లోని సివిల్ ఏవియేషన్ అథారిటీకి లేదా సింగపూర్‌కు పంపే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది.