ఏపీ మంత్రి నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా ఢిల్లీ వెళుతున్న లోకేష్ కాస్త రాజకీయ సంచలనాల దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ విషయంలో లోకేష్ కఠినంగానే ముందుకు వెళ్లే సంకేతాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా మరోసారి లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆయన కలిసే అవకాశం ఉందని ప్రచారం సైతం జరిగింది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ..!
అయితే లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు అనే వార్త బయటకు వచ్చిన తర్వాత వైసిపి నేతలు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా ఇద్దరు నేతలు విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు విమానాశ్రయాల్లో అడ్డుకున్నారు. బెంగళూరు నుంచి కొలంబో పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇక తాజాగా కొడాలి నాని విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అడ్డుకున్నారు. అయితే కొడాలి నాని విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు ప్రకటించారు. కానీ ఎన్నికల ముందు రెచ్చిపోయిన వైసీపీ నేతలు చాలా మంది ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ లో పేలిన బాంబు.. వెయ్యి మంది ఫోన్లు..?
ఇప్పుడు ఈ పరిణామాలు అన్నీ కూడా లోకేష్ ఢిల్లీ పర్యటనకు ముందు, తర్వాత చోటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది తమ అరెస్టుల కోసమే అని క్లారిటీ ఉన్న నాయకులు కొందరు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ కుంభకోణం లో ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు దేశం విడిచి పారిపోయేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. దీంతో ఏపీ పోలీసుల ముందు జాగ్రత్తగా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొంతమంది కీలక వ్యక్తుల అరెస్టులు రాష్ట్రంలో ఉండే ఛాన్స్ ఉంది అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. ఇప్పుడు ఉన్నపలంగా లోకేష్ ఢిల్లీ వెళ్లడంతో.. తమను తాము కాపాడుకోవడానికి పాస్పోర్టులు బయటకు తీశారు ఈ వైసీపీ నేతలు.