Saturday, September 13, 2025 01:19 AM
Saturday, September 13, 2025 01:19 AM
roots

మెగా ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ.. ఆ సినిమా సంగతేంటి..?

ఒకప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి సినిమా న్యూస్ వస్తే అభిమానుల్లో పండుగ వాతావరణం ఉండేది. మెగాస్టార్ చిరంజీవి నుంచి.. వైష్ణవ్ తేజ్ వరకు ఎందరో హీరోల సినిమాలను మెగా అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే గత రెండు మూడేళ్ల నుంచి మెగా ఫ్యామిలీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మెగా ఫ్యామిలీ సరైన హిట్ కొట్టలేదు. కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది.

Also Read : పారిపోవడానికి సిద్ధంగా వైసీపీ నేతలు..? చెవిరెడ్డితో స్టార్ట్ అయిందా..?

ఆ తర్వాత వరుణ్ తేజ్ రిలీజ్ చేసిన సినిమా కూడా ఒకటి ఫ్లాప్ అయింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ అనే సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువ అయ్యాయి అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూసే సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేయడం.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఆలస్యం అయ్యాయి అని రిలీజ్ డేట్ ను క్యాన్సిల్ చేయడం జరుగుతున్నాయి.

Also Read : మహిళపై దాడి.. డైరెక్ట్ గా ఎస్పీకి చంద్రబాబు ఫోన్

ఇక చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరా సినిమా కూడా ఆలస్యం అవుతుంది. ఎప్పుడో డిసెంబర్లో ఈ సినిమా విడుదల అవుతుందని మెగా ఫ్యాన్స్ ఎదురు చూశారు. రామ్ చరణ్ సినిమా కోసం తన సినిమాను చిరంజీవి వాయిదా వేసుకున్నారని ఓ ప్రకటన కూడా వచ్చింది. ఫిబ్రవరిలో లేదంటే మార్చి నెలలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సైతం భావించారు. కానీ సినిమా ఏమైందో ఇప్పటివరకు క్లారిటీ లేదు. కనీసం సినిమాకు సంబంధించిన ట్రైలర్ గానీ లేదంటే ఏదైనా ఫోటో గాని బయటికి వస్తుందని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ దాని గురించి ఏ న్యూస్ లేకపోవడంతో అసలు సినిమా విడుదల చేస్తారా లేదా అనే డైలమాలో కూడా ఫ్యాన్స్ పడిపోయారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్