ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఏమోగానీ వైసీపీ నేతలలో మాత్రం తెలియని కంగారు కనబడుతోంది. అవకాశం ఉన్నచోటకు వెళ్లిపోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేయడం, దానికి సంబంధించి వార్తలు మీడియాలో హల్చల్ కావడం, జనాలను కాస్త ఎంటర్టైన్ చేస్తుందనే చెప్పాలి. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం మద్యం కుంభకోణానికి పాల్పడింది అనే విషయం మద్యం అలవాటున్న ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది. వైన్ షాపుకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి మద్యం కుంభకోణం పై అవగాహన ఉంటుంది.
Also Read : అక్క ఫోన్ ట్యాప్ చేయించిన అన్న.. షర్మిల వద్ద సంచలన ఆధారాలు
మద్యం బ్రాండ్ల విషయంలో గానీ లేదంటే ఆన్లైన్ పేమెంట్ విషయంలో గానీ.. వైన్ షాపుల నిర్వహణ విషయంలో గానీ ప్రతి ఒక్కదానిపై జనాలకు క్లారిటీ వచ్చింది. మద్యపానం నిషేధం పేరుతో జరిగిన ఈ కుంభకోణం పై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత.. కొన్ని కీలక అరెస్టులు కూడా జరిగిన సంగతి తెలిసిందే. వేగంగా ప్రభుత్వ అధికారులను సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే గత 15 రోజుల నుంచి ఈ కేసు పై పెద్దగా వార్తలు కనపడలేదు. కానీ అనూహ్యంగా ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ..!
ఏ ఆర్ కానిస్టేబుల్ ఒకరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటుగా డీజీపీకి సైతం ఆ లేఖ రాశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేసిన అతను రాసిన లేఖపై దర్యాప్తు కూడా జరుగుతుంది. ఆ విషయం బయటకు వచ్చిన కాసేపటికి డైరెక్ట్ గా బెంగళూరు వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కొలంబో వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా.. బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇదే కేసులో విదేశాలకు పారిపోయిన రాజ్ కేసిరెడ్డిని పోలీసులు హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇంకెంతమంది ఈ వ్యవహారంలో పారిపోతారో చూడాలి.