Saturday, September 13, 2025 07:01 AM
Saturday, September 13, 2025 07:01 AM
roots

ఇంగ్లీష్ టూర్.. సెలెక్టర్లు సంచలన నిర్ణయం..?

మరో నాలుగు రోజుల్లో ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభం కానున్న నేపధ్యంలో భారత జట్టులో మార్పులు చేర్పులపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పటికే జట్టును ప్రకటించిన సెలెక్టర్లు ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న సెలెక్టర్లు.. ఓ కీలక ఆటగాడి స్థానాన్ని భర్తీ చేసేందుకు యువ ఆటగాడిని ఇంగ్లాండ్ లోనే ఉండమని చెప్పడం హాట్ టాపిక్ అయింది. అసలు ఏం జరిగింది ఏంటీ అనేది ఒకసారి చూస్తే..

Also Read : ఇంగ్లాండ్‌లో తెలుగోడికి ఛాన్స్ కష్టమే

భారత జట్టులోని కొందరు ఆటగాళ్ళు మూడు వార్మప్ మ్యాచ్‌ లు ఆడిన సంగతి తెలిసిందే. రెండు ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగినవి కాగా, ఒకటి ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్. భారత క్రికెట్ జట్టుతో పాటు, ఇండియా ఎ జట్టు సభ్యులు కూడా గత రెండు వారాలుగా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ళు ఇండియా ఎ జట్టులో భాగమయ్యారు. ఇప్పుడు, అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. రాణాను ఇంగ్లాండ్‌లోనే ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది.

Also Read : హాట్ టాపిక్‌గా బన్నీ యాటిట్యూడ్

ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన ఒక వార్మప్ గేమ్‌లో రాణా ఆడి ఒక వికెట్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా చేరికతో ప్రధాన జట్టుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా , మహమ్మద్ సిరాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ , ఆకాష్ దీప్ , అర్ష్‌దీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. బుమ్రా అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ప్రకటించారు. బూమ్రా అందుబాటులో లేకపోతే హర్షిత్ రానాతో ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత టెస్ట్ జట్టు.. జూన్ 20న లీడ్స్‌లో తొలి మ్యాచ్ ప్రారంభించనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్