Saturday, October 25, 2025 08:28 PM
Saturday, October 25, 2025 08:28 PM
roots

తన లక్కీ నెంబరే తన చివరి రోజు.. విజయ్ రూపాని విషాదం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. వందలాది మంది ప్రయాణికుల ప్రాణం తీసింది. అత్యంత సురక్షిత ప్రయాణమే చివరి మజిలీగా మారింది. కొన్ని గంటల్లో గమ్యం చేరాలనుకున్న వారికి కన్నీరు మిగిల్చింది ఈ ప్రయాణం. ఇదే విమానంలో ఉన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదం జరిగిన కాసేపటికి అదే విమానంలో ఆయన కూడా ఉన్నాడని జాతీయ మీడియా బయట పెట్టింది. ఆయనకు సంబంధించిన చివరి ఫోటో కూడా బయటకు వచ్చింది.

Also Read : ఎలా బతికానో చెప్పిన రమేష్.. సీటు బెల్ట్ ప్రాణాలు కాపాదిందా..?

అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ‘1206’ అనే సంఖ్య. ఈ నెంబర్ విజయ్ రూపానికి అత్యంత లక్కీ నెంబర్ అని ఆయన సన్నిహితులు వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా ఈ నెంబర్ ఆయనకు లక్కీ నెంబర్ అని.. వ్యక్తిగత జీవితంలో కూడా ఇది ఎంతగానో ప్రభావం చూపిందని తెలిపారు. ఆయన వాహనాల నంబర్ ప్లేట్లపై కూడా ఉండే నెంబర్. అది ఆయన చిన్ననాటి స్కూటర్ అయినా, లేదా ముఖ్యమంత్రి అధికారిక కారు అయినా.. ఏదైనా సరే ‘1206’ అనే నెంబర్ ఉంటుంది.

Also Read : విమాన ప్రమాదానికి కారణం అదేనా..?

చివరకు ఆయన అదే రోజున ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం AI171లోని 242 మందిలో రూపానీ (68) కూడా ఉన్నారు. తన భార్య, కుమార్తెను చూడటానికి లండన్ వెళ్తున్నారట. విమాన మ్యానిఫెస్ట్‌లో ఆయన సీటు 2డిలో ఉన్నారు. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు.. చనిపోయిన వారిలో విజయ్ రూపాని కూడా ఉన్నారని వెల్లడించారు. ప్రమాదం 6వ నెల 12వ తేదీన జరిగింది అంటే 12/06 అనే నెంబర్ ఆయనతో పాటే వెళ్ళిపోయిందని సన్నిహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్