Friday, September 12, 2025 09:23 PM
Friday, September 12, 2025 09:23 PM
roots

అమరావతి రైతులపై దాడి చేయమన్నాడు.. బాంబు పేల్చిన కోటంరెడ్డి

సాక్షి ఛానల్ లో అమరావతి ప్రాంత మహిళల విషయంలో చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన మహిళలు రోడ్ల మీదకు వచ్చి వైసిపి మీద అలాగే ఆ పార్టీ అనుకూల మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి వైసిపి నేతలు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి నిరసన చేసే వాళ్లను పిశాచాలుగా.. సంకరజాతి వాళ్లు గా మాట్లాడారు.

Also Read : మరో వివాదంలో సింగర్ మంగ్లీ..!

దీనిపై టిడిపి తో పాటుగా పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా దీనిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అమరావతి రైతులు నిరసన చేసిన సమయంలో వారిపై దాడి చేయాల్సింది అని.. సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా తనకు చెప్పారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంత మహిళలపై రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయించిన వ్యాఖ్యల మాదిరిగా ఉన్నాయని.. వాటిని సజ్జలు చేశారని తాను భావించడం లేదని పేర్కొన్నారు.

Also Read : అప్పుడు ప్రజాస్వామ్యం లేదా సాక్షి..?

కనీసం మనుషులుగా ఉండటానికి కూడా వీళ్లు సరిపోరని.. వైసీపీ నాయకత్వంపై ఆయన మండిపడ్డారు. అమరావతి ప్రాంత మహిళలు నిరసన చేస్తుంటే వాళ్లకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ఆ విధంగా మాట్లాడటం భావ్యం కాదన్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర రాజకీయాలతో ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కనీసం వార్డు మెంబర్ గా కూడా అతను గెలవలేడనీ.. అలాంటి వ్యక్తి అమరావతి ప్రాంత మహిళలపై వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు. ఎదుటి రాజకీయ పార్టీలపై ఆరోపణలు చేసే అర్హత కూడా వైసిపికి లేదన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్