దశాబ్దాలుగా భారత్ పై ఉగ్రవాదులను ఉసి గోల్పుతున్న పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. రెండు నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లో కఠిన చర్యలకు కూడా భారత్ దిగింది. దానితో పాటుగా అవకాశం ఉన్న ప్రతీ చోట.. పాకిస్తాన్ వైఖరిని భారత్ ఎండగడుతూ వస్తోంది. మంగళవారం.. బ్రస్సెల్స్ అధికారిక పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
Also Read : కూటమి.. పొత్తు ధర్మం పాటిస్తారా లేదా..?
పాకిస్తాన్ పై”టెర్రరిస్తాన్” అంటూ ముద్ర వేసింది. అంతర్జాతీయ సమాజం.. ఉగ్రవాదం, అణ్వాయుధ బ్లాక్‌మెయిల్ పట్ల సహాయ నిరాకరణ విధానాన్ని అవలంబించాలని కోరారు. సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితిని రెండు దేశాల మధ్య సంఘర్షణగా చూడకూడదని, ఉగ్రవాదంపై భారత్ చర్యలుగా చూడాలని వ్యాఖ్యానించారు. ఇది రెండు దేశాల మధ్య వివాదం కాదు. ఇది వాస్తవానికి ఉగ్రవాద ముప్పు అని స్పష్టం చేసారు. ఉగ్రవాద అంతంపై ప్రపంచ సహకారం కావాలని కోరారు.
Also Read : కృష్ణంరాజు.. దీనవ్వ తగ్గేదెలా..!
మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ భూ భాగంలో భారత్ దాడులకు దిగగా దీనికి అంతర్జాతీయ సమాజం మద్దతు తెలిపింది. ఇక పాక్ కూడా భారత్ పై దాడులకు దిగిన నేపధ్యంలో.. అమెరికా జోక్యం చేసుకోవడం కాల్పుల విరమణ జరగడం వంటివి చూసాం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ కు టర్కీ వంటి దేశాలు మద్దతు ఇవ్వడం వివాదాస్పదం అయింది. పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించే విషయంలో భారత్ వెనక్కు తగ్గకపోయినా ఆపరేషన్ సిందూర్ ను కొనసాగించాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి.