Saturday, September 13, 2025 01:10 AM
Saturday, September 13, 2025 01:10 AM
roots

జనంలోకి టీడీపీ.. టార్గెట్ ఫిక్స్..!

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తోంది. కడపలో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ తర్వాత టీడీపీ నేతలు మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 164 సీట్లను కూటమి పార్టీలు సాధించాయి. వై నాట్ 175 అని గొప్పగా చెప్పి ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది కొందరు టీడీపీ నేతల మాట. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ముఖ్యనేతలంతా కూడా వైసీపీకి వచ్చిన 40 శాతం ఓట్ల గురించే ఆలోచించారు. వైసీపీ ఓడింది.. అంతే తప్ప.. పూర్తిగా చతికిలపడిపోలేదనేది టీడీపీ నేతల మాట. అందుకే కడపలో జరిగిన మహానాడులో మంత్రి నారా లోకేష్ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ప్రతి కార్యకర్త పని చేయాలని లోకేష్ సూచించారు. అధికారంలో ఉన్నామనే ఏమరుపాటు వద్దన్నారు. అలాగే కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటానని భరోసా ఇచ్చారు కూడా.

Also Read : చినాబ్ వంతెనలో తెలుగు మహిళ కృషి.. ప్రముఖుల ప్రశంసలు

ఇక టీడీపీ కడప మహానాడులో 6 కీలక తీర్మానాలు చేశారు. వాటి గురించి స్పష్టంగా వివరించారు నారా లోకేష్. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధినేత చంద్రబాబు కూడా దిశానిర్దేశం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకే పాలన మాదిరిగా గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. జూలై 1వ తేదీ నుంచి ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు వెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికను కూడా ఇప్పటికే పార్టీ నేతలు రూపొందించినట్లు తెలుస్తోంది. పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న మేలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృధికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనేది టీడీపీ నేతల ప్లాన్. ప్రజల్లో పార్టీకి మరింత మైలేజ్ రావాలనే లక్ష్యంతోనే ప్రతి కార్యకర్త పని చేయాలనేది టీడీపీ నేతల మాట.

Also Read : తప్పు చేస్తే.. ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే..!

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి సర్కార్ అమలు చేస్తోంది. అయినా సరే.. ప్రభుత్వంపై వైసీపీ నేతలు మాత్రం తరచూ తప్పుడు ఆరోపణ చేస్తున్నారనేది సీఎం చంద్రబాబు మాట. ప్రజల నుంచి ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో రియాక్షన్ రావటం లేదనేది కూడా చంద్రబాబు భావన. ఐవీఆర్ సర్వే ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో 80 శాతం సంతృప్తిగా ఉన్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ సర్వే ఫైనల్ కాదని.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అంశంపై చర్చ కూడా నడుస్తోంది. ఇది రేపు ఎన్నికల సమయానికి ఇబ్బందులు తప్పవనేది చంద్రబాబు భయం కూడా. అందుకే ఎన్నికల వరకు వేచి చూడకుండా.. ఇప్పటి నుంచే ప్రజలకు చేరువయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Also Read : దుమ్ము రేపిన బాలయ్య.. షేక్ చేస్తున్న అఖండ తాండవం

ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వారిని, పథకాలు అందని వారిని గుర్తించాలనేది చంద్రబాబు సూచన. అలాగే ప్రజలకు – ఎమ్మెల్యేలకు గ్యాప్ పెరుగుతుందనే మాట కూడా పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ప్రజలకు, నేతలకు మధ్య ఎలాంటి దూరం లేదనే భావన ప్రజల్లో కల్పించాలనేది చంద్రబాబు భావన. ఇందుకోసమే పార్టీ పరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. క్షేత్ర‌స్థాయిలో చంద్ర‌బాబుకు ఉన్న గ్రాఫ్ పెరిగింది. కానీ ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు స్థానికంగా ఉన్న నేతను కూడా చూస్తారనేది వాస్తవం. అందుకే స్థానిక నేతలను ఓటర్లకు దగ్గర చేసేందుకు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూలై 1వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో నేతలు ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ప్రతి రోజు ప్రతి నేత తమ నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్