Friday, September 12, 2025 07:31 PM
Friday, September 12, 2025 07:31 PM
roots

ముద్రగడ ఆరోగ్యంపై అనుమానాలు..!

కాపు ఉద్యమ నేత ఆరోగ్యంపై అనుమానాలు.. కుమార్తె చేసిన ఆరోపణలను తండ్రి, కొడుకులు ఎందుకు ఖండించలేదు.. నిజానిజాలు బయట పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు.. నిజంగానే ఆరోగ్యం విషమంగా ఉందా.. అందుకే ప్రభుత్వం కూడా జాలి చూపించిందా.. ఇప్పుడు ఇవే పెద్ద ఎత్తున వినిపిస్తున్న ప్రశ్నలు. ఇంతకీ ఆ కాపు ఉద్యమ నేత ఎవరో తెలిసిందా.. ఆయన ఎవరో కాదు.. ముద్రగడ పద్మనాభ రెడ్డి. 2024 ఎన్నికలకు ముందు వరకు ముద్రగడ పద్మనాభం అంటే కాపు ఉద్యమ నేతగా ఓ గుర్తింపు. అయితే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలవరని ముద్రగడ పందెం కాసారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్‌ ఓటమి కోసమే తాను పని చేస్తా అంటూ ముద్రగడ బహిరంగంగానే ప్రకటించారు. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటా అని శపథం కూడా చేశారు. ఎన్నికల్లో కూటమి గెలుపు, పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలవటంతో.. అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ పేరు మార్చుకుని గెజిట్ నోటిఫికేషన్ కూడా చేయించుకున్నారు.

Also Read : ఆ తేదీ కోసమే కూటమి నేతల ఎదురుచూపులు..!

కాపు ఉద్యమ నేతగా గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరించారు. ఇక తొలి నుంచి టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగా రాజకీయాలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాపు రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు. అంతే తప్ప కాంగ్రెస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కాపుల మేలు గురించి పల్లెత్తు మాట అన్న పాపాన పోలేదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తుని సమీపంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించిన కాపు నేతలు.. తుని రైల్వేస్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత కాపులకు చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేశారు. అయినా సరే.. ముద్రగడ మాత్రం నోరెత్తలేదు.

Also Read : ఇంగ్లీష్ టూర్ ముందు రెండు దేశాలు కీలక నిర్ణయం

వైసీపీ నేతల అడుగులకు మడుగులు ఒత్తిన ముద్రగడ.. మళ్లీ సరిగ్గా ఎన్నికల సమయంలో కాపులకు చంద్రబాబు ద్రోహం చేశాడంటూ గగ్గొలు పెట్టారు. ముద్రగడ నాటకాలు పసిగట్టిన కాపులు.. వైసీపీని పక్కన పెట్టి.. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపించారు. దీంతో తన పాచిక పారలేదని భావించిన ముద్రగడ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్‌గా సైడ్ అయిపోయారు. కాపు ముసుగులో వైసీపీ అధినేతకు అనుకూలంగా పనిచేస్తున్నట్లు పసిగట్టిన ముద్రగడ కుమార్తె.. ఆయనకు దూరంగా జరిగారు. జనసేన పార్టీలో చేరారు. ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు కూడా. తాజాగా ముద్రగడ ఆరోగ్యంపై కుమార్తె క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా ముద్రగడ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని వెల్లడించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రికి తన సోదరుడు సరైన చికిత్స కూడా చేయించడం లేదని క్రాంతి ఆరోపించారు.

Also Read : ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు బాబు, పవన్ రెడీ

కొద్ది రోజులుగా ముద్రగడ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని.. ఆయనకు సరైన చికిత్స చేయించడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రిని కలిసేందుకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేను కూడా తన సోదరుడు గిరి, అతని మామ అడ్డుకున్నారని.. కలిసేందుకు అనుమతించలేదని కూడా క్రాంతి ఆరోపించారు. చివరికి బంధువులు, సన్నిహితులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని క్రాంతి వెల్లడించారు. ముద్రగడను బంధించారని ఆరోపించిన క్రాంతి.. ఒంటరిగానే ఉంచుతున్నారన్నారు. చివరికి సమీప బంధువులను కూడా ముద్రగడ దగ్గరకు వెళ్లనివ్వటం లేదన్నారు. రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తుంటే మాత్రం సోదరుడు గిరికి తగిన గుణపాఠం చెప్తానని వార్నింగ్ ఇచ్చారు. గతంలో ముద్రగడ బాగోగులు చూసుకున్న క్రాంతి… రాజకీయంగా విభేదించి జనసేనలో చేరిన తర్వాత తండ్రికి దూరమయ్యారు. నాటి నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డికి, క్రాంతికి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో క్రాంతి తండ్రి ఆరోగ్యంపై పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్