సంచలన నిర్ణయాలతో కంగారు పెడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాజాగా 12 దేశాలకు ఊహించని షాక్ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమ దేశంలోకి వచ్చే వలసల విషయంలో ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. మధ్య ప్రాచ్యంతో పాటుగా ఆఫ్రికా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ మద్దతుదారులపై.. కొలరాడో దాడి తర్వాత, జాతీయ భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకుని 12 దేశాల నుండి ప్రయాణాన్ని నిషేధించారు ట్రంప్.
Also Read : రంగంలోకి షర్మిల.. వారే టార్గెట్..!
దీనిపై బుధవారం ట్రంప్ సంతకం చేసారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్‌లతో సహా 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం (జూన్ 9) తెల్లవారుజామున 12:01 గంటలకు అమల్లోకి వచ్చింది. ఈ నిషేధంతో పాటు, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్ మరియు వెనిజులా నుండి వచ్చే పర్యాటకులపై తాత్కాలిక నిషేధం విదేశించారు.
Also Read : మంత్రుల రిపోర్ట్ లు రెడీ.. షాక్ ఇవ్వనున్న బాబు
వీటిలో బీ-1, బీ-2, ఎఫ్, ఎం, జెడ్ కేటగిరీల వీసాలపై పరిమితులు విధించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన.., ఇరాన్, క్యూబాలో ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం, చాడ్ మరియు ఎరిట్రియా వంటి దేశాల వీసా నిబంధనల ప్రకారం ఈ నిర్ణయాలు తీసుకుంది ట్రంప్ సర్కార్. గతంలో కూడా ట్రంప్ ఇదే తరహాలో నిర్ణయం తీసుకున్నారు. ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా మరియు యెమెన్ దేశాలపై నిషేధం విధించారు. మాజీ అధ్యక్షుడు జో బిడెన్ 2021లో ఆ నిర్ణయాన్ని రద్దు చేసారు.




