Friday, September 12, 2025 07:19 PM
Friday, September 12, 2025 07:19 PM
roots

రంగంలోకి షర్మిల.. వారే టార్గెట్..!

కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేలా శ్రేణులను సిద్ధం చేశారు. ఆ ఎన్నికల్లో ఇండియా కూటమి అన్నీ స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు 159 స్థానాల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 5 లక్షల 80 వేల ఓట్లు పోలయ్యాయి. అనూహ్యంగా 1.72 శాతం ఓట్లను హస్తం పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారు.

Also Read : జగనన్న.. ఎక్కడున్నావు.. ఏమయ్యావు..?

కడప పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన షర్మిల.. ఒక దశలో గెలుపు ఖాయం అనేలా ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తిరుగుబావుటా ఎగురవేసిన షర్మిల.. మరో సోదరుడు అవినాష్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా లక్షా 41 వేల ఓట్లు పోలయ్యాయి. 11 శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఒకరకంగా ఈ ఎన్నికలో టీడీపీ ఓటమికి షర్మిల పరోక్షంగా కారణమైంది కూడా. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య తేడా కేవలం 62 వేల ఓట్లు మాత్రమే. ఈ ఎన్నికలో షర్మిల తప్పుకుని ఉంటే.. ఆ ఓట్లు టీడీపీకి పోలయ్యేవనేది సైకిల్ పార్టీ నేతల మాట. అయితే అన్నకు గట్టి పోటీ ఇచ్చిన షర్మిల.. కడపలో వైసీపీ మెజారిటీని 3 లక్షల 80 వేల నుంచి 62 వేలకు పడేసిందనేది వాస్తవం. ఎప్పటికైనా కడపలో షర్మిల గెలుపు ఖాయమని.. వైసీపీని ఓడించేది కూడా షర్మిల మాత్రమే అని వైఎస్ కుటుంబ సన్నిహితులు వ్యాఖ్యానించారు కూడా.

Also Read : మంత్రుల రిపోర్ట్ లు రెడీ.. షాక్ ఇవ్వనున్న బాబు

ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన షర్మిల.. రాబోయే స్థానిక ఎన్నికలకు సన్నద్ధం చేసే లక్ష్యంతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 9వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు షర్మిల. ముందుగా ఈ నెల 9న చిత్తూరులో తన టూర్ మొదలుపెట్టి.. 5 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రాయలసీమ పరిధిలోని జిల్లాల్లో 7చోట్ల జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దశాబ్దాల తరబడి రాష్ట్రాన్ని ఏలిక కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దుస్థితికి చేరుకుంది. ఇక ఇదే అదునుగా భావించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలపై అసహనంతో ఉన్న నేతలకు వైసీపీలో ఆశ్రయం కల్పించారు. దీంతో కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా దాదాపు వైసీపీలో చేరిపోయారు. అలా వచ్చిన వారికి వైఎస్ఆర్ అభిమానులంటూ ముద్ర కూడా వేశారు తప్ప.. కాంగ్రెస్ పార్టీ పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు జగన్.

Also Read : చంద్రబాబు మార్క్ పాలన.. వాటిపైనే దృష్టి..!

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతోనే వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించారు ఢిల్లీ పెద్దలు. దీంతో రంగంలోకి దిగిన షర్మిల.. ముందుగా తన అన్న వైఎస్ జగన్ పైనే యుద్ధం ప్రకటించారు. వైసీపీ బలహీనపడితే.. అప్పుడు నేతలు, కార్యకర్తలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు వస్తారనేది షర్మిల ప్లాన్. ఇదే సమయంలో వచ్చే ఏడాది రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసే లక్ష్యంతో జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహించడానికి పర్యటించాలని నిర్ణయించారు.

Also Read : లోకేష్ పై పవన్ ప్రసంశలు

ఈనెల 9వ తేదీన రాష్ట్ర స్థాయి పర్యటనను రాయలసీమ జిల్లాల నుంచి షర్మిల మొదలు పెట్టనున్నారు. 9వ తేదీ సాయంత్రం చిత్తూరులో పార్టీ జిల్లా నేతలతో షర్మిల భేటీ కానున్నారు. 10వ తేదీ ఉదయం అన్నమయ్య జిల్లా రాజంపేట, రాయచోటి, సాయంత్రం సత్యసాయి జిల్లా హిందూపురంలో సమావేశాలు నిర్వహిస్తారు. 11 వతేదీ ఉదయం అనంతపురంలో, సాయంత్రం కర్నూలులో సమావేశాలు నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయం నంద్యాలలో, సాయంత్రం కడపలో సమావేశాలు నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం నెల్లూరులో సమావేశం నిర్వహించి అదేరోజు సాయంత్రం తిరుపతి చేరుకుంటారు. ఆ తరువాత 18వ తేదీన విశాఖపట్నం జిల్లా నుంచి 20వ తేదీన అనకాపల్లి జిల్లా వరకు పర్యటించి ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశాల్లో, 25వ తేదీన గుంటూరు జిల్లా నుంచి 30వ తేదీన ఎన్టీఆర్ కృష్ణ జిల్లా వరకు మిగిలిన జిల్లాల సమావేశాల్లో పాల్గొంటారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్