Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

క్రికెట్ ప్రపంచం గుర్తించని హీరో.. శశాంక్ సింగ్

ఎంతో ఆసక్తి రేపిన ఐపిఎల్ సీజన్ ముగిసింది. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందా అని ఆసక్తిగా చూసిన అభిమానులకు మంగళవారం సాయంత్రంతో ఆ ఆసక్తికి తెరపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత ప్రముఖ జట్టుగా పేరున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపిఎల్ ను కైవసం చేసుకుంది. 18 ఏళ్ళ తర్వాత తొలిసారి ఆర్సీబీ విజయం సాధించింది. లీగ్ దశ నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ జట్టు.. ఫైనల్ లో కాస్త తడబడ్డట్టు కనపడినా.. అదిరిపోయే బౌలింగ్ తో విజయం సాధించింది.

Also Read : ఈసారి అయినా సార్ బయటకు వస్తారా..?

చివరి ఓవర్ వరకు ఉత్కంటభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆరు పరుగులతో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ ఒంటరి పోరాటం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ఓ వైపు వికెట్లు కోల్పోయినా, గెలుపు కష్టంగా మారుతున్నా అతను మాత్రం తగ్గలేదు. భారీ షాట్ లతో విరుచుకుపడ్డాడు శశాంక్ సింగ్. పంజాబ్ జట్టు గెలవకపోయినా అతని అర్ధ సెంచరీ మాత్రం చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. చివర్లో కెమెరాలు మొత్తం కోహ్లీని ఫోకస్ చేసాయి.

Also Read :మాజీ క్రికెటర్ కు బీజేపీ గాలం.. ఈసారి వర్కౌట్ అవుతుందా..?

4 పరుగుల్లో 29 పరుగులు కావాలనుకున్న సమయంలో అతను భారీ సిక్సులు కొట్టాడు. హెజిల్వుడ్ బౌలింగ్ లో ఆడిన ఒక్కో షాట్ సంచలనమే. మరో బంతి మిగిలి ఉంటే ఖచ్చితంగా పంజాబ్ విజయం సాధించేది అనేది క్రికెట్ అభిమానుల అభిప్రాయం. ఆరు సిక్సులు కొట్టిన శశాంక్ సింగ్.. పంజాబ్ ను గెలిపిస్తాడని అందరూ భావించారు. కాని కీలక సమయంలో కోల్పోయిన వికెట్ లు పంజాబ్ ను ఇబ్బంది పెట్టాయి. స్టోయినిస్ అవుట్ కాకుండా ఉండి ఉంటే.. పంజాబ్ గెలవడం పెద్ద మేటర్ కాదేమో..

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్