Friday, September 12, 2025 10:37 PM
Friday, September 12, 2025 10:37 PM
roots

ఈసారి అయినా సార్ బయటకు వస్తారా..?

జనం కోసం జగన్.. వైసీపీ నేతలు పదే పదే చెప్తున్న మాట ఇదే. మాట తప్పడు.. మడమ తిప్పడు అని కూడా గొప్పగా చెప్తారు. అయితే ఇదంతా పైకి మాత్రమే. వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. అధికారం కోసం పాదయాత్ర పేరుతో ప్రజలకు చాలా మాటలు చెప్పారు జగన్. కనిపించిన ప్రతి ఒక్కరితో ఫోటోలు, ముద్దులు పెట్టడం, నెత్తి మీద చేతులు వేయటం చేశారు. ఇక ఒక్క ఛాన్స్ అని బతిమిలాడిన జగన్.. అన్నోస్తున్నాడంటూ వైసీపీ నేతల ద్వారా తెగ ప్రచారం చేయించారు. ఇక వైసీపీ నేతలు చేసిన తప్పుడు ఆరోపణల వల్ల నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్‌ పార్టీనే గెలిపించారు. ఇక అప్పటి నుంచి జగన్‌లోని అపరిచితుడు బయటకు వచ్చాడు.

Also Read : కవితకు హరీష్ కౌంటర్..!

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రజల్లోకి రావాలంటేనే భయపడిపోయారు. కేవలం పరదాల మాటునే ప్రయాణం చేశారు. ప్రజలకు జగన్ దర్శనమే కరువైంది. చివరికి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. అటు ప్రభుత్వంలో అయినా.. ఇటు పార్టీ పరమైన కార్యక్రమమైనా సరే.. అంతా నంబర్ టూ స్థాయి నేతలు, అధికారులే. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ధనుంజయ్ రెడ్డి ఫైనల్. పార్టీ సమస్యలు ఏమైనా సరే.. అది సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే చాలు. అంతే తప్ప.. జగన్‌కు తమ సాధక బాధకాలు చెప్పుకునే అవకాశం మాత్రం ఏ ఒక్క నేతకు నేరుగా దక్కలేదు.

Also Read : వైసీపీకి టీటీడి ఉద్యోగి ఊడిగం.. రెచ్చగొట్టి వీడియో రికార్డు

ఒంటెద్దు పొకడల కారణంగానే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిందనేది బహిరంగ రహస్యం. కోట లాంటి ప్యాలెస్‌లో జగన్.. కోట బయట గేటు దగ్గర కార్యకర్తల పడిగాపులు.. అనే మాట వైసీపీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా అసహనానికి గురి చేసింది. ఇక ఓటమి తర్వాత కూడా జగన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మకాం నేరుగా బెంగళూరుకు మార్చేశారు. వారంలో రెండు రోజుల పాటు మాత్రమే తాడేపల్లికి వస్తున్నారు. ఇక అప్పుడు కూడా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఓ నాలుగు మాటలు చెబుతున్నారు తప్ప.. కార్యకర్తల కోసం ఒక్కసారి కూడా స్పందించినట్లు లేదు. తప్పులు చేసి జైలుకు వెళ్లిన నేతలను పదే పదే పరామర్శిస్తున్నారు జగన్. కానీ పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : ఎవరు గెలిచినా చరిత్రే.. ఆసక్తిగా ఐపిఎల్ ఫైనల్

వాస్తవానికి ఈ ఏడాది జనవరి 8వ తేదీ నుంచే జనంలోకి వస్తున్నట్లు గతంలో గొప్పగా ప్రకటించారు జగన్. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 రోజుల పాటు కార్యకర్తలు, నేతలతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి.. వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు సభలు కూడా నిర్వహిస్తారని వైసీపీ నేతలు వెల్లడించారు. కానీ జనవరి నెలాఖరు వరకు జగన్ బయటకు రాలేదు. ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులేవి అంటూ మరో ధర్నాకు పిలుపునిచ్చారు. అది కూడా వాయిదా వేశారు. ఇక పార్టీ నేతలపైన వరుసగా కేసులు పెడుతున్నారని గగ్గొలు పెడుతున్న వైసీపీ అధినేత.. పార్టీ నేతలతో చర్చించారు. జిల్లాల వారీగా కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

జిల్లాల్లో ఉండటం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుందని వెల్లడించారు. కేసులు, హామీల గురించి ప్రజలకు నేరుగా వివరిస్తామన్నారు. జూన్ 8వ తేదీ నుంచి జిల్లాల పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జిల్లాల పర్యటన ప్రారంభం అవుతుందని.. ప్రతీ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశం కానున్నట్లు తెలిపారు. కూటమి బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచే ఈ పర్యటన ప్రారంభించాలని కూడా జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం.. జగన్ సార్ ఇప్పటికైనా బయటకు వస్తారా.. లేక మరోసారి వాయిదా వేస్తారా అని సొంత పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్