ఏపీలో ప్రభుత్వం మారినా సరే కొంతమంది ఉద్యోగులు మాత్రం వైసిపికి ఊడిగం చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మొదట్లో పోలీసులలో చాలా మంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు.. అయితే ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉండటం, కఠినంగా వ్యవహరించే దిశగా కొని కీలక అడుగులు పడటంతో పోలీసుల వైఖరిలో మార్పు వచ్చింది. వైయస్ జగన్ బెదిరిస్తున్నా సరే పోలీసులు మాత్రం వైసిపి నేతలకు ఊడిగం చేయడానికి ఇప్పుడు కాస్త వెనకడుగు వేస్తున్నారు.
Also Read : ఉక్రెయిన్ మాస్టర్ మైండ్.. ఒక్క అటాక్ తో రష్యాకు షాక్.. అమెరికాకు వార్నింగ్
అక్కడక్కడ కొంత మంది అధికారులు ఇప్పటికీ సహకరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినపడుతున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల విషయంలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలామంది అధికారులపై వినపడుతున్నాయి. తాజాగా తిరుమలలో ఒక ఘటన చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్లో రెండు రోజుల క్రితం కాకినాడకు చెందిన వైసిపి నాయకుడు బి అచ్చారావు.. టిటిడి చైర్మన్ తో పాటుగా అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీడియో ఒకటి బయటకు వచ్చింది.
Also Read : జగన్ 2.0.. భయపడుతున్న జనం..!
అయితే ఆ వీడియోని రికార్డు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది టిటిడి ఉద్యోగి అని విచారణలో తేలింది. ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి.. నిరసనకు మద్దతు తెలపడంతో పాటుగా అతనిని రెచ్చగొట్టాడని కూడా గుర్తించారు. ఇక అక్కడ వీడియో రికార్డు చేసి వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో ప్రచారం చేయించినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ప్రస్తుతం సదరు ఉద్యోగిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీలో 2000 మంది ఉద్యోగులు తమ వారే ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది.