సాంకేతిక రంగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఏదోక ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు సరికొత్త చరిత్రలు రాస్తూనే ఉన్నారు. తాజాగా ఓ బ్యాక్టీరియాను సృష్టించి షాక్ ఇచ్చారు. భవిష్యత్ ఆవిష్కరణలకు శక్తినిచ్చే, బయోటెక్నాలజీ మరియు ఇంధన పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రైస్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం ఓ రకం బ్యాక్టీరియాకు ప్రాణం పోశారు.
Also Read: ఉక్రెయిన్ మాస్టర్ మైండ్.. ఒక్క అటాక్ తో రష్యాకు షాక్.. అమెరికాకు వార్నింగ్
విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా శ్వాస తీసుకుంటుంది ఈ బ్యాక్టీరియా. ఆక్సిజన్‌ను పీల్చుకోవడానికి బదులుగా ఎలక్ట్రాన్‌లను ద్వారా శ్వాస తీసుకుంటుంది. చాలా జీవులు ఆహారాన్ని జీవక్రియ చేయడానికి, శక్తిని విడుదల చేయడానికి ఆక్సిజన్‌పై ఆధారపడగా, కొన్ని బ్యాక్టీరియాలు ఎలక్ట్రాన్‌లను బాహ్య ఉపరితలాలకు బదిలీ చేయడానికి నాఫ్థోక్వినోన్స్ అని పిలువబడే సహజంగా లభించే సమ్మేళనాలను ఉపయోగిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రక్రియను ఎక్స్ ట్రా సెల్యులార్ రెస్పిరేషన్ అని పిలుస్తారు.
Also Read: జగన్ 2.0.. భయపడుతున్న జనం..!
ఇది బ్యాటరీలు విద్యుత్ ప్రవాహాన్ని ఎలా విడుదల చేస్తాయో అలా జరుగుతోంది. తద్వారా బ్యాక్టీరియా ఆక్సిజన్ లేకుండా వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుందని జర్నల్ సెల్‌లో ప్రచురించబడిన అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. బయోటెక్నాలజీలో ఈ అసాధారణ శ్వాసక్రియ విధానాన్ని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఉపయోగించుకుంటున్నప్పటికీ, దీని వెనుక ఉన్న యంత్రాంగాన్ని గుర్తించడం ఇదే మొదటిసారి. ఆక్సీజన్ లేని ప్రాంతాల్లో అధునాతన కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించారు.