ఒకప్పుడు ఆటగాళ్ళు జాతీయ జట్టులోకి రావాలంటే రంజీ లేదా దేశవాళి సీజన్ కీలకంగా ఉండేది. ఐపిఎల్ వచ్చిన తర్వాత మాత్రం క్రమంగా సీన్ మారుతూ వచ్చింది. ఐపిఎల్ లో ప్రదర్శన చేసిన వాళ్లకు జాతీయ జట్టులో అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు ఆటగాళ్ళు ఐపిఎల్ లో దుమ్ము రేపి జాతీయ జట్టులో చోటు కొట్టేస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా సాయి సుదర్శన్ ఆట తీరు ఉంది. ఎక్కడ అవకాశం వచ్చినా.. ఎప్పుడు అవకాశం వచ్చినా సరే తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు సాయి సుదర్శన్.
Also Read : బాలీవుడ్ మాఫియాను లెఫ్ట్ లెగ్‌తో తన్నిన సందీప్ రెడ్డి
ఇప్పుడు జరుగుతున్న ఐపిఎల్ సీజన్ లో అతని ఆట తీరుకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. ఈ సీజన్ లో మొత్తం 760 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. 156 స్ట్రైక్ రేట్ తో.. 56 యావరేజ్ తో అదరగొట్టాడు. దేశవాళి సీజన్ లో కూడా సాయి సుదర్శన్ ఇలాగే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా ఏ తరుపున ఆడిన సాయి సుదర్శన్.. సెంచరీ కూడా నమోదు చేసాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా మెరుగ్గా రాణించాడు. త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ టూర్ కు ఎంపికయ్యాడు.
Also Read : ఫిక్సింగ్ జరిగిందా.. ముంబైపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్
తాజాగా ముంబై తో జరిగిన మ్యాచ్ లో కూడా 80 పరుగులతో రాణించాడు. ఈ సీజన్ లో ఇంత నిలకడగా రాణించిన ఆటగాడు మరొకరు లేరు. గిల్ కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అయినా.. సాయి సుదర్శన్ మాత్రం అవ్వలేదు. ఇక అతని బ్యాటింగ్ లో పుల్ షాట్స్, యార్కర్ లు ఆడటం హైలెట్ గా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అతను యార్కర్లకు అవుట్ కాలేదు. ఒక్కసారి మాత్రమే షార్ట్ పిచ్ బంతికి అవుట్ అయ్యాడు. రెండు సార్లు మాత్రమే బౌల్డ్ అయ్యాడు. ఇలాగే ఆడితే మాత్రం ఖచ్చితంగా టీం ఇండియాకు మరో యువరాజ్ దొరికినట్టే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.