Friday, September 12, 2025 07:31 PM
Friday, September 12, 2025 07:31 PM
roots

పొత్తుపై కీలక వ్యాఖ్యలు.. వారికి మాస్ వార్నింగ్..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. అయితే ఈ పొత్తుపై తొలి నుంచి ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. పొత్తు ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి లేదనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం గతంలో టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తు బ్రేక్ అయ్యింది. 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన మద్దతును టీడీపీ – బీజేపీలకు ప్రకటించారు. దీంతో ఆ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. అటు కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కార్‌లో టీడీపీకి కూడా మంత్రిపదవులు దక్కాయి. అయితే అనివార్య కారణాల వల్ల ఈ బంధం తెగిపోయింది. చివరికి ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఏపీలో కూడా ప్రభుత్వం నుంచి బీజేపీ వేరుపడింది.

Also Read : గద్దర్ అవార్డులు వీరికే.. ప్రకటించిన జ్యూరి

ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అన్ని స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జనసేన గెలిచింది కేవలం ఒకటే. ఇక బీజేపీ పరిస్థితి అయితే దారుణం. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో 3 పార్టీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్ల పాటు విధ్వంసక పాలన కొనసాగించింది. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేనానిపై వ్యక్తిగత దూషణకు దిగింది. కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడారు వైసీపీ నేతలు. అసెంబ్లీలో కూడా వ్యకిగత దూషణలు చేశారు. చివరికి ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. దీంతో కౌరవ సభ నుంచి వెళ్లిపోతున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది.

Also Read: పాకిస్తాన్ బహిరంగ సభలో పహల్గాం ఉగ్రవాది సంచలన కామెంట్స్

ఇక తప్పుడు కేసులో చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై పెను ప్రభావం చూపాయి. ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అటు హైదరాబాద్‌లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆందోళనపై నాటి మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసనలు, ఆందోళనలు మీ రాష్ట్రానికి వెళ్లి చేసుకోండి.. ఇక్కడ కాదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైంది. దీంతో తెలంగాణ ప్రజలు కూడా టీడీపీ అధినేత అరెస్టును ఖండించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేటీఆర్‌కు తత్వం బోధపడింది.

Also Read : వాడు చేసేది చిచోరా రాజకీయం.. అన్న పై కవిత తిరుగుబాటు

ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి ఉమ్మడి శత్రువును మట్టికరిపించాయి. చివరికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గెలుపు మా వల్ల అంటే మా వల్లే అని 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. దీంతో కొన్ని చోట్ల ఆధిపత్య పోరు తలెత్తింది. ఇక నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా ఎక్కువ, తక్కువ అనే మాట వచ్చింది. దీంతో త్వరలోనే పొత్తు తెగిపోతుందనే మాటను వైసీపీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. 3 పార్టీల మధ్య విడాకులు లేవన్నారు. ఈగోలు పక్కన పెట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. అలాగే కలిసే ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో తాము ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే పని చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Also Read : మొత్తం ఆయనే చేశారు.. బడా నిర్మాతపై ఆరోపణ..!

వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. తాను యువగళం పాదయాత్రలో చెప్పిన రెడ్ బుక్ అంటే ఎందుకంత భయం అని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారిపైన మాత్రమే చర్యలుంటాయని పాదయాత్రలోనే చెప్పానని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలకు ఎర్ర రంగు చూస్తేనే భయమేస్తోందన్నారు. చంద్రబాబును తొలిసారి రాజమండ్రి జైలులో చూసినప్పుడు చాలా బాధ కలిగిందన్నారు. ప్రజల కోసమే చంద్రబాబు పని చేశారని… కానీ అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో జైలులో పెట్టారని భావోద్వేగానికి గురయ్యారు. అందుకే తెలుగు ప్రజలు చంద్రబాబు వెనుక నిలబడ్డారన్నారు. ఇక రెడ్ బుక్ పై అప్పట్లో పెద్ద ఎత్తున నోరు పారేసుకున్న వైసీపీ నేతలు కొందరు.. బాత్ రూమ్‌లో జారీ పడి కాలు, చెయ్యి విరగొట్టుకున్నారని… మరొకరికి గుండె పోటు వచ్చిందని.. ఇంకొకరికి ఏమైందో అందరికీ తెలుసని లోకేష్ ఎద్దేవా చేశారు. రాయలసీమ గడ్డ.. తెలుగుదేశం పార్టీ అడ్డ అని పార్టీ శ్రేణులకు లోకేష్ పిలుపునిచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్