Tuesday, October 28, 2025 02:10 AM
Tuesday, October 28, 2025 02:10 AM
roots

కోవర్టులు.. వలస పక్షులు.. బీ కేర్ ఫుల్..!

కోవర్టులు చేరుతున్నారు.. బీ కేర్ ఫుల్.. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను హెచ్చరించారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై నుంచి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. పార్టీ బలోపేతం కావడానికి.. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన జంట హత్యలను పరోక్షంగా ప్రస్తావించిన చంద్రబాబు.. సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ టీడీపీకి చెడ్డపేరు తెచ్చి.. సులభంగా వారి టార్గెట్‌లను హత్య చేస్తున్నారని కోవర్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : మద్దతు ప్లీజ్.. హస్తినకు జగననన్న

పార్టీలోకి వలస పక్షులు వస్తాయి.. పోతాయి.. కానీ నిజమైన కార్యకర్త మాత్రమే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాడన్నారు. అదే సమయంలో పార్టీ నేతలంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే ముందు సొంత పార్టీ కార్యకర్తల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని నేతలతో వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీలో వెళ్లే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుతం టీడీపీలో వైసీపీ కోవర్టులు ఉన్నారని.. మనతో ఉంటూనే వాళ్ల టార్గెట్ దిశగా పని చేస్తున్నారని ఇలాంటి తప్పులు చేసే వారిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కోవర్టులను మన దగ్గరకి పంపి, ఆ కోవర్టుల ద్వారా మీ ఎజెండా అమలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదని.. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2029లో ఇంతకంటే భారీ మెజారిటీ సాధించాలని చంద్రబాబు కోరారు.

Also Read : ఏకతాటిపైకి పార్టీ.. లోకేష్ కు రూట్ క్లియర్

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అసలు ఈ కోవర్ట్ ఆపరేషన్ డిజైన్ చేసింది జగన్ అని విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. జగన్ ఓ ఫ్యాక్షనిస్టు… హింసా రాజకీయాలను ప్రొత్సహిస్తారన్నారు. అలాగే ఆర్థిక నేరస్తుడు కూడా. అంటే.. చేతికి మట్టి అంటకుండా తప్పులు చేయడంలో సిద్ధహస్తుడు. అందుకే.. అధికారంలో ఉన్న పార్టీలోకి నెమ్మదిగా చోటా నాయకులను ముందు పంపిస్తాడు. ఆ తర్వాత వారితో రాజకీయాలు నడిపిస్తాడు. పదవుల కోసం తన్నుకున్నట్లుగా అందరికీ చూపిస్తాడు. వినుకొండలో జరిగిన హత్యను టీడీపీ కార్యకర్తలు చేసినట్లుగా చూపించేందుకు జగన్ నానా పాట్లు పడ్డాడు. చివరికి పరామర్శ పేరుతో కూడా రాజకీయాలు చేశాడని విమర్శించారు.

Also Read : స్పిరిట్ నుంచి దీపిక అందుకే తప్పుకుందా..?

ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి ఎవరైనా రావాలంటే.. పెద్ద స్థాయి నేత ఎవరైనా సరే.. పార్టీ అధినేత నిర్ణయమే ఫైనల్ అని నేతలు స్పష్టం చేశారు. ఆయన కూడా ముందు ఆ నియోజకవర్గం నేతలతో చర్చించిన తర్వాతే తీసుకుంటున్నారన్నారు. కానీ కొందరు మాత్రం.. గ్రామస్థాయి నేతల సమక్షంలో పార్టీ మారి ఇలా అరాచకం చేస్తున్నారి… ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధినేత చంద్రబాబు సూచిస్తున్నారని వెల్లడించారు. ఇక పార్టీలో పదవులకు అర్హులైన వారు చాలా మంది ఉన్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసమే కష్టపడిన వాళ్లు కూడా ఉన్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పసుపు జెండా కోసం పని చేస్తున్న కార్యకర్తలు కూడా ఉన్నారు. కేవలం సామాజిక సమీకరణలో భాగంగానే ఒకరిద్దరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చాం తప్ప.. ప్రస్తుతం కేటాయించిన పదవులన్నీ తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలకే అని పార్టీ నేతలు మరోసారి స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్