పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ నేతలంతా ఇప్పుడు ఒకటే ప్రశ్న వేస్తున్నారు.. అదే జగనన్న.. మాకేంటీ బాధ అని ప్రశ్నిస్తున్నారు. అయితే అధినేతను గట్టిగా ప్రశ్నించలేక.. చెప్పిన పని చేయలేక.. లోపల లోపల తీవ్రంగా మదన పడుతున్నారు. ఇంతకీ అన్న ఏం చెప్పాడు.. ఆ పని చేయడానికి కార్యకర్తలకు వచ్చిన ఇబ్బంది ఏమిటీ అనేది కిందిస్థాయి నేతల్లో అనుమానం తలెత్తింది. ఇలా చేస్తున్నందుకు వైసీపీ ముఖ్యనేతలు సైతం కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో తమ వద్దకు వచ్చే కార్యకర్తలపై అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.
Also Read : వైసీపీకి మరో షాక్ సిద్ధం..?
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. సిట్ అధికారులు కింగ్ పిన్ కోసం వేట తీవ్రతరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటు నాటి ముఖ్యమంత్రి ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ్ రెడ్డి కూడా ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీంతో ఇక తర్వాత ఎవరి వంతు అనే ప్రశ్నపై జోరుగా చర్చ నడుస్తోంది. భారతీ సిమెంట్ సంస్థలో బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక జగన్‌కు ధనుంజయ్ రెడ్డి అత్యంత సన్నిహితంగా వ్యవహారించారు. దీంతో తర్వాత భారతీ, జగన్‌లకు నోటీసులు ఇస్తారనే మాట బాగా వినిపిస్తోంది. అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆఘమేఘాల మీద ప్రెస్ మీట్ పెటి.. ఏకంగా గంట పాటు కేవలం మద్యం స్కామ్ కేసు విచారణ, అరెస్టులపై మాట్లాడారనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.
Also Read : లిక్కర్ స్కాం చైన్ లింక్ బ్రేక్ చేసిన సిట్..?
అయితే ఒక విషయం మాత్రం వైసీపీ నేతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అదేమిటంటే.. ప్రతిరోజు విజయవాడ జిల్లా జైలు దగ్గరకు వెళ్లాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలు. లిక్కర్ స్కామ్‌లో బాలాజీ గోవిందప్ప అరెస్టు వరకు పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి అరెస్టు తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో భయం మొదలైనట్లు తెలుస్తోంది. అందుకే సిట్ అధికారులు విచారణ చేస్తున్న రోజు నుంచే కార్యాలయం బయట వైసీపీ నేతలు పడిగాపులు కాచారు. విచారణ జరిగిన ప్రతిరోజు లోపలికి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఆయనతోనే ఉన్నారు. ఇక భోజనం వంటివి కూడా వీళ్లే అరెంజ్ చేశారు. అయితే విచారణకు సహకరించలేదంటూ సిట్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను అరెస్టు చేస్తున్నట్లు రాత్రి 9 గంటలకు వెల్లడించారు.
Also Read : సాయిరెడ్డి మీద ఇంత కోపం ఎందుకు..?
అరెస్ట్ ప్రకటన వచ్చిన వెంటనే తాడేపల్లి ప్యాలెస్‌కు ఆఘమేఘాల మీద సమాచారం చేరుకుంది. ఇక అంతే.. న్యాయవాదులను రంగంలోకి దింపారు. దీంతో రాత్రంతా వైసీపీ నేతలు కార్యాలయం బయటే కాపాలాగా ఉన్నారు. ఇక కోర్టులో హాజరు పరిచే సమయంలో కూడా బెయిల్ వస్తుందని గంపెడాశతో ఉన్నారు. అందుకే ఉదయమే విజయవాడ కోర్టుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్యూ కట్టేశారు. ధనుంజయ్ రెడ్డి కంటే ముందే వీళ్లంతా జిల్లా కోర్టుకు చేరుకుని బెయిల్ వస్తుందని ఆశపడ్డారు. కానీ న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో.. అయ్యో అని కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు ప్రధానంగా ఒకటే కారణం.. ఇప్పటి వరకు ఆఫీసు ముందు, కోర్టు ముందు కాపాలాగా ఉన్నాం.. ఇక నుంచి జిల్లా జైలు బయట ఎదురు చూడాలా అని బాధపడ్డారు.
Also Read : ఈడీకి సుప్రీం బ్రేకులు.. చీఫ్ జస్టీస్ సంచలన వ్యాఖ్యలు
వాళ్లంతా అనుకున్నట్లే.. విజయవాడ జిల్లాకు ప్రతిరోజు కొందరు నేతలు వస్తున్నారు. జైలులో ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులకు ఏం కావాలో అని కనుక్కుంటున్నారు. జైలులో భోజనం, వసతి, సౌకర్యాలపై విచారిస్తున్నారు. ఇక వీరంతా కోర్టుకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా “ధనుంజయ్ సార్.. ఎలా ఉన్నారు..” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ విషయాన్ని మళ్లీ తాడేపల్లి ప్యాలెస్‌కు అప్‌డేట్ కూడా చేస్తున్నారు. అయితే ఆ తర్వాత మాత్రం.. మాకు ఇదేం ఖర్మ అంటూ విసిగించుకుంటున్నారు. ధనుంజయ్ రెడ్డి వల్ల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎంఓ బయట నేతలకు ఎదురు చూపులు.. పార్టీ ఓడిన తర్వాత జైలు బయట పడిగాపులు.. అదేం ఖర్మ అన్న.. అంటూ వాపోతున్నారు.




