Friday, September 12, 2025 10:54 PM
Friday, September 12, 2025 10:54 PM
roots

గులాబీ పార్టీలో కాళేశ్వరం కలవరం.. ఫాం హౌస్ కు హరీష్

తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రకంపనలు భారత రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టే సంకేతాలు కనపడుతున్నాయి. ఇటీవల కాళేశ్వరం విచారణ కమీషన్ మాజీ సిఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏం చేయాలనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. గత వారం రోజుల్లో రెండు సార్లు మాజీ మంత్రి హరీష్ రావు తో కేసీఆర్ భేటీ అయ్యారు. తాజాగా మరోసారి హరీష్ రావు.. కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫాం హౌస్ కు వెళ్ళడం చర్చనీయాంశం అయింది.

Also Read : వైసీపీకి మరో షాక్ సిద్ధం..?

ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ భేటీ అయ్యారనే వార్త తెలంగాణా రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ నెల 20న కూడా కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నోటీసులు తీసుకొని అందులో ఉన్న సారాంశాన్ని వివరించి.. అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై.. ఇద్దరూ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : లిక్కర్ స్కాం చైన్ లింక్ బ్రేక్ చేసిన సిట్..?

కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన నుండి నేటి వరకు జరుగుతున్న పరిణామాలను కూడా చర్చిస్తున్నారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే.. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా చర్చిస్తున్నారు. ఐఏఎస్ అధికారులతో పాటుగా జలవనరుల శాఖ అధికారులు కూడా విచారణలో కేసీఆర్ పేరునే ఎక్కువగా చెప్పినట్టు సమాచారం. ఇక దీనిపై హైకోర్ట్ లో పిటీషన్ వేసే అంశంపై చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ సమావేశం తర్వాత.. మిగిలిన పార్టీ సీనియర్ నేతలతో కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్