టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అనేదానిపై ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీలో ఫిట్నెస్ ఇంకా ఉన్న నేపథ్యంలో అతను మరికొంత కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉందని చాలామంది భావించారు. మరో రెండేళ్లపాటు టెస్ట్ క్రికెట్లో అతను కొనసాగే అవకాశం ఉండొచ్చని అంచనా వేశారు. కానీ వన్డేలకు మాత్రమే పరిమితం అవుతూ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ.
Also Read : రికార్డ్ బ్రేకింగ్ జోడీ.. సాయి సుదర్శన్ – గిల్
ఇక తర్వాత సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇంగ్లాండ్ లో కౌంటి క్రికెట్ ఆడేందుకు విరాట్ కోహ్లీ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. చాలామంది మాజీ క్రికెటర్లు ఇంగ్లాండ్ లో ఇప్పటికీ కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత బ్రిటన్ లోనే సెటిల్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే మకాం లండన్ కు మార్చేసాడు. వన్డే క్రికెట్ మాత్రమే ఆడటంతో.. విరాట్ కోహ్లీకి మరింత సమయం దొరుకుతుంది. దానికి తోడు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో ఓ ప్రముఖ జట్టు ఇప్పటికే చర్చలు కూడా జరపడం మొదలుపెట్టింది.
Also Read : ఉమాకు ఖాయమే..? అధిష్టానం క్లారిటీ..?
త్వరలోనే దీనికి సంబంధించి ఒప్పందం కూడా చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ కౌంటి క్రికెట్ ఆడితే తమ జట్టుతో పాటుగా ఆ దేశ కౌంటి క్రికెట్ కు కూడా ఆదరణ పెరుగుతుందని భావిస్తుంది ఆ జట్టు యాజమాన్యం. ఇప్పటికే విరాట్ కోహ్లీకి భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని ప్రచారం సైతం జరుగుతుంది.