సినిమా వాళ్లకు ట్యాగ్ లైన్ కనపడని ఒత్తిడి. అది మెగాస్టార్, విక్టరి, కింగ్, నట సింహం, ఐకాన్, గ్లోబల్.. ఇలా ఏదోక ట్యాగ్ లైన్ లతో జనాలు హడావుడి చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ చేసే హడావుడి కూడా వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు ఇదే కొందరు హీరోల మీద కనపడని ఒత్తిడి పెంచుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కాస్త ఒత్తిడి తీసుకువచ్చిన మాట వాస్తవం. అదే సమయంలో మ్యాన్ ఆఫ్ ది మాసేస్ అని ఎన్టీఆర్ కు ఓ ట్యాగ్ లైన్ వచ్చింది.
Also Read : అప్పన ఆలయంలో వారే కీలకమా..!
పుష్ప టైం లో అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. వాళ్ళందరూ వారి వారి ట్యాగ్ లైన్స్ కు న్యాయం చేస్తే.. రామ్ చరణ్ మాత్రం వరుస ఫ్లాపులతో చుక్కలు చూస్తున్నాడు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో వచ్చినవే. భారీ బడ్జెట్ తో చేసిన సినిమాలే. కాని ఊహించని దెబ్బ కొట్టడంతో రామ్ చరణ్.. మెగా బ్రాండ్.. వాల్యూ ప్రమాదంలో పడింది. ఓటీటీ సంస్థలు కూడా రామ్ చరణ్ సినిమాలు కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి.
Also Read : లోకేష్ ట్వీట్‌తో టీడీపీ కార్యకర్తలు హర్ట్ అయ్యారా..?
ఇటీవల రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అనే సినిమాకు అసలు వ్యూస్ రాకపోవడం కూడా చికాకు పెట్టింది. దీనితో ఓటీటీ సంస్థలు ముందుకు రావడం లేదనే టాక్ వినపడుతోంది. ఇప్పుడు ఈ ఒత్తిడిలో ఉన్న రామ్ చరణ్.. పెద్ది సినిమాపై సీరియస్ ఫోకస్ పెట్టాడు. రంగస్థలం సినిమాకు ఎలా కష్టపడ్డాడో ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే స్థాయిలో కష్టపడే ప్రయత్నం చేస్తున్నాడు. సుకుమార్, బుచ్చి బాబు ఇద్దరూ ఈ సినిమాకే వర్క్ చేస్తున్నారు. ఎలాగైనా హిట్ కొట్టి బ్రాండ్ వాల్యూ కాపాడుకోవాలనేది రామ్ చరణ్ పట్టుదల.