Friday, September 12, 2025 07:20 PM
Friday, September 12, 2025 07:20 PM
roots

షర్మిలకు ఉన్న ధైర్యం జగన్ కు లేదా..?

ఏపీకి ప్రధాని మోడీ టూర్ తో నేషనల్ వైడ్ గా అమరావతి అనే బ్రాండ్ మరోసారి గట్టిగా వినపడుతోంది. ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. భూ కేటాయింపులు జరిగాయి, కేంద్రం నిధులు విడుదల చేసింది, రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తోంది. ఇక పెట్టుబడి దారులు కూడా అమరావతి రావాలనే ఆహ్వానాలు వెళ్ళాయి. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా తమ నోటికి పని చెప్పే ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ వస్తున్నారు.

Also Read : మళ్లీ కుంటి సాకులు చెబుతున్న జగన్..!

ఇక్కడ చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది వైసీపీ. అయితే మోడీ విషయంలో మాత్రం విమర్శించే సాహసం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. మోడీని, చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు గట్టిగానే చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం మోడీని విమర్శించే ప్రయత్నం చేయడం లేదు. గతంలో మట్టి నీళ్ళు ఇచ్చిన సందర్భంగా కూడా వైసీపీ నేతల నుంచి పెద్దగా విమర్శలు రాలేదు. ఇక జగన్ విషయానికి వస్తే.. కనీసం మీడియాతో కూడా ఆయన మాట్లాడలేదు.

Also Read : మరో నోటు మాయమైతుందా..?

అమరావతి పనులపై జగన్ నుంచి విమర్శలు లేవు. ప్రసంశలు ఏ రూపంలోనూ ఉండే అవకాశం లేదు. కాని ఓ వైపు చెల్లెలు మోడీని విమర్శిస్తుంటే.. జగన్ మాత్రం మోడీ విషయంలో మౌనంగా ఉండిపోయారు. ఇదే సమయంలో వైసీపీ నేతలకు కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబును మాత్రమే విమర్శించాలని, మోడీ విషయంలో మౌనంగా ఉండాలని, చేసినా సున్నితంగా విమర్శించాలని పార్టీ నేతలను ఆదేశించారట జగన్. కాగా గురువారం సాయంత్రమే జగన్.. బెంగళూరు వెళ్ళిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్