Friday, September 12, 2025 11:23 PM
Friday, September 12, 2025 11:23 PM
roots

ముస్లిం నాయకుల స్వరం మారిందా..? అలెర్ట్ అయ్యారా..?

దేశవ్యాప్తంగా జమ్ము కాశ్మీర్ దాడి తర్వాత పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ టార్గెట్ గా సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పలువురు రాజకీయ నాయకులు, సామాన్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి హిందువుల లక్ష్యంగానే జరిగింది అనేది కూడా అందరికీ అవగాహన ఉంది. పేరు అడిగి మరి దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మరణించిన వారికి ఫ్యాంట్ జిప్పులు కూడా తీసి ఉండటం సంచలనమైంది.

Also Read : కోహ్లీ.. కార్తిక్ మధ్య ఏం జరిగింది..?

అయితే నిపుణులు వ్యక్తం చేస్తున్న కొన్ని అభిప్రాయాలు ఆసక్తిగా మారాయి. దేశవ్యాప్తంగా హిందుత్వ వాదాన్ని బిజెపి లేదంటే సంఘ్ పరివార్ బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లే అవకాశం దొరికిందని.. పాకిస్తాన్ తో పాటుగా ఓ మతాన్ని కూడా దేశంలో కొంత మంది దోషిగా చూసే సంకేతాలు కనపడుతున్నాయని.. అందుకే కొంతమంది ముస్లిం నాయకులు జాగ్రత్త పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్ని విషయాల్లో బిజెపి సోషల్ మీడియా కాస్త ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటుంది.

Also Read : ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటా: బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి విషయంలో కూడా ఇలాగే జరిగింది. దీంతోనే జమ్మూ కాశ్మీర్లో ఉన్న రాజకీయ పార్టీలతో పాటుగా మజిలీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా.. దేశానికి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారని.. కేంద్రానికి మద్దతిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని భావిస్తున్న ముస్లిం పార్టీల నాయకులు దేశానికి మద్దతుగా నిలబడటానికి ఆసక్తి చూపిస్తున్నారనేది అర్థమవుతుంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు పాకిస్తాన్ పై అలాగే ఉగ్రవాదం పై విమర్శలు చేయని నాయకులు అందరూ.. ఇప్పుడు మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్