వైఎస్ అనే పేరు వింటే చాలు.. బ్యూరోక్రాట్లు బాబోయ్ అనేస్తున్నారు. ఐదేళ్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన అయినా… ఐదేళ్ల వైసీపీ పాలన అయినా సరే.. ముందుగా బలైంది ఎవరూ అంటే.. అధికారులే అనే మాట స్పష్టంగా తెలుస్తోంది. 2004 ఎన్నికల ముందు వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రత్యేక గౌరవం ఉన్న మాట వాస్తవం. ఇంకా చెప్పాలంటే.. ఎన్టీఆర్, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు చెప్పిందే వేదం అన్నట్లుగా ఉండేది. కొన్ని సందర్భాల్లో పార్టీ నేతల కంటే కూడా అధికారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. ఈ విషయంలో పలువురు పార్టీ నేతలు సైతం చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కొందరు అధికారుల నిజాయతీ మెచ్చిన చంద్రబాబు.. వారికి రాజకీయంగా అవకాశాలు కూడా కల్పించారు.
Also Read : బ్రేకింగ్: కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
కానీ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది అనేది బహిరంగ రహస్యం. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం నిర్వహించారని.. ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో తన సొంత ఆస్తులు కూడా భారీగా పెంచుకున్నారనేది వాస్తవం. 2004 ఎన్నికల అఫిడవిట్‌కు 2009 ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్‌కు భారీ తేడా ఉంది. అప్పటి వరకు అప్పులు చూపించిన వైఎస్ కుటుంబం.. అడ్వాన్స్ టాక్స్ చెల్లించే స్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధానంగా మైనింగ్‌ను ఆదాయ మార్గంగా ఎంచుకుంది. ఇందుకు ఐఏఎస్ అధికారులను పావులుగా ఉపయోగించుకుంది. ఐదేళ్లు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో క్విడ్ ప్రో కోకు ఐఏఎస్ అధికారులు సహకరించారు. అందుకే జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి జైలు జీవితం కూడా గడిపారు.
Also Read : అరెస్టు లిస్టు సిద్దం.. వైసీపీలో మొదలైన అలజడి
ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే నాడు ఐఏఎస్‌లు అయితే.. ఇప్పుడు ఐపీఎస్‌లు. అధికారులను అడ్డుపెట్టుకుని ఏపీలో అరాచక పాలన సాగించారనేది అందరికీ తెలిసిన విషయమే. తనకు ఎదురు చెప్పిన వారిపై పోలీసులను ప్రయోగించారు వైఎస్ జగన్. మాజీ సీఎం అయినా సరే.. సొంత పార్టీ ఎంపీ అయినా సరే.. తప్పుడు కేసులు పెట్టడం.. వారిని అక్రమంగా జైలుకు పంపడం.. నానా పాట్లు పడేలా చూడటం.. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకున్నారు జగన్. ముంబై నటి జత్వానీ కేసులో ఐఏఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఐఏఎస్ అధికారిగా అందరితో సెల్యూట్ కొట్టించుకున్న పీఎస్ఆర్ ఆంజనేయులు.. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇక మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో మరో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఏ క్షణమైనా సరే.. ఆయన అరెస్టు ఖాయమనే మాట ఇప్పుడు బ్యూరోక్రాట్ సర్కిల్‌లో వినిపిస్తోంది. మొత్తానికి తండ్రి వల్ల ఐఏఎస్‌లు, కొడుకు వల్ల ఐపీఎస్‌లు జైలు పాలవుతున్నారు.