Friday, September 12, 2025 05:25 PM
Friday, September 12, 2025 05:25 PM
roots

చంద్రబాబు బర్త్ డే స్పెషల్.. విజనరీ లీడర్..!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు… పనిరాక్షసుడన్న పేరు సొంత చేసుకున్న అభివ‌ృద్ధి కాముకుడు. 1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివ‌‌ృద్ది వైపు తాను పరిగెడుతూ.. యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.. 75 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ పెట్టిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ చరిత్ర అంటే 1995కు ముందు.. తర్వాత అన్నట్లు మాట్లాడుకునేలా మార్చేశారు చంద్రబాబు. చివరికి బద్ధశత్రువులైన కమ్యూనిస్టులు కూడా 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు చేపట్టిన సంస్కరణల గురించి మాట్లాడుకుంటున్నారంటే దటీజ్ విజనరీ.

అప్పటి వరకు హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్‌బండ్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. అయితే బాబు హయాంలో హైటెక్ సిటీకి ముందు.. హైటెక్ సిటీ తర్వాత… అన్నట్లు హైదరాబాద్ మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. విజన్ ఉన్న నేతగా ఆయన హయాంలో నిర్మించిన సైబర్ టవర్స్ లేకపోతే ఇప్పటి హైటెక్ సిటీనే లేదు. ఇంకా చెప్పాలంటే అసలు సైబరాబాద్ అనే పేరు కూడా లేదనే చెప్పాలి.

Also Read : చంద్రబాబు బర్త్ డే స్పెషల్.. అపర చాణక్యుడు..!

సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత ప్రపంచ స్ధాయి ఐటీ సంస్ధలు హైదరాబాద్‌ను తమ స్ధావరంగా చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సైబర్ టవర్స్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారని ఇప్పటికీ ఐటీ ఉద్యోగులు చెప్పుకునే పరిస్థితి. ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చి, నేడు ప్రపంచానికే తలమానికంగా మారింది హైటెక్ సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన సైబర్ టవర్స్ చలవతో హైటెక్ సిటీ ఏర్పడి ఎందరికో ఉపాధి చూపిస్తోంది.

అతిసామాన్యులు, రైతు బిడ్డలు ఇప్పుడు ఐటీ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగడంతో ఆయా కుటుంబాల లైఫ్ స్టైలే మారిపోయిందని చెప్పవచ్చు. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయం దినదిన గండంగా మారి అల్లాడిన రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కుతూ హైటెక్ లైఫ్ గడుపుతున్నారు. ఈ ఘనత అసాంతం నారావారిపల్లెలో పుట్టి… పాఠశాల విద్య కోసం రోజు 11 కిలోమీటర్లు నడిచి వెళ్లిన నారా చంద్రబాబుదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : రోజాకు అండగా కూటమి మంత్రి

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ధిక సంస్కరణలను పూర్తిగా అనుసరించిన నాయకుడు చంద్రబాబు… చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ హైదరాబాద్ సందర్శించారంటే ఆయన అభివ‌ృద్ది స్ట్రాటజీలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు లాంటి వ్యక్తులు భారత్‌లో పర్యటించినా సాధారణంగా హైదరాబాద్ వంటి నగరాలకు రారు. అయితే బాబు ఆర్థిక విధానాలు క్లింటన్, బ్లెయిర్‌లను హైదరాబాద్ రప్పించాయంటారు.

ప్రధాన నగరాలను అభివృద్ధి చేసి సమాచార-సాంకేతికత, బయో టెక్నాలజీ, ఆరోగ్య రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి బాబు ఎంతగానో శ్రమించారు. హైటెక్ అభివృద్ధి కోసం.. బై బై బెంగళూరు, హలో హైదరాబాద్… అన్న నినాదానికి శ్రీకారం చుట్టారు. దాంతో అప్పట్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్‌లో ఓ కేంద్రం ఏర్పాటు చేసింది. ఐబీఎం, డెల్, డెలాయిట్, ఒరాకిల్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలు ఏర్పాటు చేయడం వెనుక ఆయన కృషే ప్రధాన కారణమని చెప్పాలి.

Also Read : అమెరికాలో పెద్ద ఎత్తున రోడ్డున పడ్డ తెలుగు వాళ్ళు

కేవలం 14 నెలల కాలంలో సైబర్ టవర్స్ నిర్మాణం పూర్తి చేసి హైటెక్ సిటీ ఏర్పాటుకు బలమైన పునాదులు వేసింది ఆయనే. 2003-2004లో హైదరాబాద్ నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఒక బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ పునాది ఆధారంగానే ఈ ఎగుమతులు 2013-2014 నాటికి పది రెట్లు పెరిగాయి. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలలో ఒక్క హైదరాబాద్‌లోనే లక్షల మందికి ఉపాధి లభిస్తోందిప్పుడు.

హైటెక్ బాబు అనిపించుకుంటున్న ఆయన హయాంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగురోడ్లకు పునాదులు పడ్డాయి. అలాగే మెట్రో రైలుకు ప్లాన్ కూడా చేశారు. హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. ఇదంతా చంద్రబాబు ఘనతే అని ఆయా సందర్భాల్లో విపక్షాల నేతలే ప్రశంసిచారంటే ఆయన పరిపాలనా దక్షత ఎలా ఉండేదో అర్థం అవుతుంది. రాబోయే తరాలకు ఏం కావాలో.. వారి అవసరాలు ఏమిటో ముందుగానే ఊహించగల విజనరీ లీడర్ చంద్రబాబు. 1995లోనే 2020లో ఊహించి విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేశారు. ఇక నాలుగోసారి సీఎం అయిన తర్వాత 2047లో భారత్ ఎలా ఉంటుందో ఇప్పుడే స్కెచ్ చేశారు. గతంలో PPP విధానాన్ని తెరపైకి తీసుకువచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు P4 నినాదంతో పేదలను ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకే.. అంటారు.. చంద్రబాబును అంతా విజనరీ లీడర్ అని.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్