Monday, October 27, 2025 10:30 PM
Monday, October 27, 2025 10:30 PM
roots

పాలిటిక్స్‌కు గుడ్ బై.. పెద్ద ప్లాన్ వేసిన బుగ్గన..!

వైసీపీని నడిపించేది ఎవరు.. జగన్ తరఫున లాబీయింగ్ జరిపించేది ఎవరు.. జగన్‌ను అరెస్టు నుంచి కాపాడేది ఎవరు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు వైసీపీ పెద్దలను వెంటాడుతున్నాయి. ఓ వైపు అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు పెచ్చింది. ఇప్పటికే సుమారు 16 వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో జగన్‌కు చెందిన ఆస్తులే 800 కోట్ల వరకు ఉన్నాయి. అలాగే జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన దాల్మియా సిమెంట్ సంస్థలకు చెందిన మరో 790 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. మరోవైపు అక్రమాస్తుల కేసును రోజువారీ విచారణ జరిపించి సాధ్యమైనంత త్వరగా తీర్పు ఇవ్వాలంటూ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇటు ఈడీ జప్తులు… అటు కోర్టులో పిటిషన్లతో జగన్ అండ్ కో టీమ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Also Read : బాబు సంతకంతో జగన్ సైలెంట్..!

వాస్తవానికి ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసి ఇప్పటికే 12 ఏళ్లు దాటింది. కానీ ఇప్పుడు జప్తు చేయడం వెనుక కారణం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా జగన్ తరఫున ఢిల్లీలో చక్రం తిప్పేందుకు సరైన నేత లేడనే మాట వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు జగన్ తరఫున అన్నీ తానే అయ్యి విషయాలు చక్కబెట్టారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డికి బీజేపీ అగ్రనేతలతో మంచి సంబంధాలున్నాయి. 2014లో ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చే నాటికే.. నాటి కేంద్ర పెద్లలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. జగన్‌పై ఎక్కడా ఈగ వాలకుండా కంటికి రెప్పలా కాపాడారు విజయసాయిరెడ్డి. ఏపీలో బీజేపీ నేతలు కూడా జగన్‌పై విమర్శలు చేయలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా.. నాటి ఏపీ బీజేపీ నేతలు జగన్ సర్కార్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వ తప్పుల వల్లే.. అంటూ విచిత్రమైన వాదన తెరపైకి తీసుకువచ్చారు.

Also Read : టీ కాంగ్రెస్ లో ఎంపీ గారి డామినేషన్ వేరే లెవల్

అయితే వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన తర్వాత జగన్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ తరఫున లాబీయింగ్ చేసే నేత కరువయ్యారు. కేంద్రంలో వ్యవహారాలు నడిపించే నేత కోసం జగన్ తీవ్రంగా గాలించారు. ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎంపీలు అంతా రాష్ట్రస్థాయి నేతలే తప్ప.. వారికి కేంద్రంలో పెద్దగా పరిచయాలు లేవు. నిన్నటి వరకు మంతనాలు జరిపిన మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు కేసులు, కోర్టులు అంటూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపైన జగన్ ఫోకస్ పెట్టారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు బుగ్గన. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఆ సమయంలో ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ప్రతి నెలా అప్పులు చేయాల్సి వచ్చింది. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీలో కంటే.. ఢిల్లీలోనే ఎక్కువ గడిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు బీజేపీ పెద్దలతో తరచూ సమావేశమయ్యారు. ఈ పరిచయాలే బుగ్గనకు ప్రస్తుతం ఢిల్లీవైపు అడుగులు పడేలా చేస్తున్నాయి.

Also Read : సాయిరెడ్డితో వైసీపీ రాజీ కష్టాలు

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గన.. గత ఎన్నికల్లో కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి చేతుల్లో ఓడారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడే డోన్ మునిసిపాలిటీ పరిధిలోని తన సొంత వార్డులో టీడీపీ కౌన్సిలర్ విజయం సాధించారు. దీంతో అప్పుడో బుగ్గనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాజకీయాలకు తప్పుకోవడమే ఉత్తమమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భావించారు. అందుకే డోన్ నుంచి గత ఎన్నికల్లో తన కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కూడా జగన్‌ను కోరారు. అయితే జగన్ మాత్రం.. ప్రస్తుతానికి వారసులకు అవకాశం లేదని.. తేల్చిచెప్పడంతో తప్పని పరిస్థితుల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల సమయంలో తండ్రి గెలుపు బాధ్యతను మొత్తం అర్జున్ రెడ్డి చూసుకున్నాడు. నామినేషన్ మొదలు కౌంటింగ్ రోజు వరకు అన్నీ తానే అయ్యారు అర్జున్ రెడ్డి. అయితే డోన్‌లో వైసీపీ ఓటమి తర్వాత తండ్రి కొడుకులిద్దరూ సైలెంట్ అయ్యారు. ఇక రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తిగా హైదరాబాద్‌కు పరిమితం అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపైన, ఏపీ బడ్జెట్ పైన కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లోనే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప… డోన్, తాడేపల్లికి వచ్చిన దాఖలాలు లేవు.

Also Read : వైసీపీలో దర్శకత్వ సమస్య.. జగన్ డైరెక్టర్ ఎవరో..?

ప్రస్తుతం వైసీపీ తరఫున.. ముఖ్యంగా జగన్ తరఫున కేంద్రంలో లాబీయింగ్ జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జగన్ దూతగా బుగ్గన ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తన కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డికి పట్టు వస్తుందని భావిస్తున్నారు. బుగ్గన కూడా ఇకపై రాష్ట్ర రాజకీయాలకంటే కూడా ఢిల్లీ పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొడుకు అసెంబ్లీకి, తండ్రి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో బుగ్గన కూడా జగన్ మాటకు సరే అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో స్వామి కార్యం.. స్వ కార్యం కూడా జరుగుతుందనేది బుగ్గన ప్లాన్. ఏపీలో పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పేసి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్