Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

వైసీపీ ఎమ్మెల్సీకి శిక్ష ఖాయమా..?

హత్య చేయడమే దారుణం.. చేసిన తప్పునకు ఎలాంటి భయం బెరుకు లేకుండా.. మృతదేహాన్ని నేరుగా ఇంటికే తీసుకువచ్చి అప్పగించి వెళ్లాటమంటే.. ఇది బరితెగింపు కాదా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళిత డ్రైవర్‌‍ను హత్య చేసి.. అతని మృతదేహాన్ని నేరుగా డ్రైవర్ ఇంటికే డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు. రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన అనంత ఉదయభాస్కర్.. అక్కడి గిరిజనులను భయపెట్టి ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు. రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో.. ఆయన ధనలక్ష్మి అనే టీచర్‌ను వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ధనలక్ష్మి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. అనంతబాబు మాత్రం షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. నియోజకవర్గంలో జరిగే ఏ అధికార కార్యక్రమం అయినా సరే అనంతబాబు అనుమతితోనే జరగాలి. వైసీపీ అధినేత జగన్ కూడా అనంతబాబు సేవలకు మెచ్చి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇక అంతే.. పదవి చేతికి రావడంతో.. అనంతబాబు ఆకృత్యాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

Also Read : అమెరికాకు టూరిస్ట్ వీసా కూడా కష్టమేనా..? వైరల్ అవుతున్న పోస్ట్

తన అక్రమాల గుట్టు తెలిసిన డ్రైవర్ పని మానేసినట్లు తెలుసుకున్న అనంతబాబు… అతన్ని మట్టుబెట్టేందుకు ప్లాన్ చేశాడు. మాట్లాడాలి రమ్మంటూ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను గెస్ట్ హౌస్‌కు పిలిపించాడు. అక్కడ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు అనంతబాబు. పనుందని స్వయంగా అనంతబాబు తీసుకెళ్లిన తెల్లారే సుబ్రహ్మణ్యంను శవమై తేలాడు. అది కూడా సుబ్రహ్మణ్యం ఇంటి ఎదురుగానే ఎమ్మెల్సీ కారులోనే మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. ఇదేంటని అప్పుడే ప్రశ్నిస్తే.. నాకేం తెలియదు అంటూ అనంతబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు, దళిత సంఘాల ఫిర్యాదు మేరకు అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు అనంతబాబు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు నాటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వెల్లడించారు కూడా. అయితే అధికార పార్టీ నేత కావడంతో కొందరు పోలీసుల అలసత్వంతో అనంతబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు. దాదాపు రెండేళ్లుగా బెయిల్‌పైనే ఉన్నారు.

Also Read : బీ కేర్ ఫుల్.. పవన్‌కు రోజా వార్నింగ్..!

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బాధితులకు న్యాయం చేసేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో బాధితుల తరఫున ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా ప్రబుత్వం నియమించింది. వాస్తవానికి ఈ హత్యపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని దళిత సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇది కేవలం హత్య కాదని.. దళితులపై దాడి అని ఆరోపించారు కూడా. అనంతబాబు ఒక్కడే ఈ హత్య చేయలేదని.. మరో 11 మంది కూడా ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్నారని ఆరోపించారు. ఆ రోజు అనంతబాబుతో ఎవరెవరున్నారు.. అసలేం జరిగింది.. దళిత డ్రైవర్‌ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే విషయాలు బయటకు రావాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెక్నాలజీ సాయంతో ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తూ నిందితులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా కృషి చేస్తామని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు శిక్ష ఖాయమనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్