Friday, September 12, 2025 11:02 PM
Friday, September 12, 2025 11:02 PM
roots

బాబు సంతకంతో జగన్ సైలెంట్..!

ఏపీలో ఇప్పుడు మత రాజకీయాలే హాట్ టాపిక్. ఏ చిన్న విషయం దొరుకుతుందా.. దానితో రాజకీయం చేద్దామా అని వైసీపీ నేతలు భూతద్దం వేసుకుని మరీ వెతుకుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లుగా.. ఒక్క ఫోటో దొరికినా, ఒక్క ఆధారం దొరికినా చాలు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, విమర్శలు చేయడానికి, దుమ్మెత్తి పోయడానికి రెడీ అవుతున్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో మొదలైన రాజకీయం.. చివరికి టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయనే వరకు చేరుకుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి, తర్వాత కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లుపై డబుల్ గేమ్.. ఇప్పుడు టీటీడీ గోశాల వ్యవహారం. ఇలా ఎక్కడ ఏం సాకు దొరుకుతుందా అని వైసీపీ నేతలు గోతికాడ నక్క మాదిరిగా ఎదురు చూస్తున్నారు.

Also Read : ఏపీ పోలీస్ భేష్.. మొదటి స్థానంలో తెలంగాణా 

వైసీపీ అధినేత జగన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వాస్తవానికి క్రిస్టియానిటీని ఆచరిస్తున్న వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కుటుంబం.. ఆ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తొలి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది. క్రైస్తవులు ఎంతో భక్తితో జరుపుకునే గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కూడా జగన్ సిద్ధమయ్యారు. తమ ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎంతో మేలు చేశామని.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి.. క్రైస్తవులపై దాడులు జరిగేలా ప్రోత్సహిస్తున్నారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తర్వాత క్రైస్తవులను రెచ్చగొట్టేలా వైసీపీ నేత బెన్నిలింగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తీరా రాజమండ్రి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన తర్వాత.. నాకేం తెలియదు అంటూ చేతులెత్తేశారు బెన్నిలింగం.

Also Read : మాజీ మంత్రిపై అధినేత సీరియస్..!

కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జగన్.. తాము అధికారంలో ఉన్నప్పుడు పాస్టర్లకు, మత ప్రభోదకులకు గౌరవ వేతనం నెలనెలా పింఛన్ రూపంలో ఇచ్చామని గొప్పగా చెప్పారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించటం లేదని ఆరోపించారు. ఈ ఆరోపణలకు చంద్రబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మాటలతో కాకుండా చేతలతో జవాబు చెప్పారు చంద్రబాబు. పాస్టర్లకు, క్రిస్టియన్ మతాచార్యులకు రూ.5 వేల పింఛన్, లేదా గౌరవ వేతనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 కంటే ముందు వైసీపీ ప్రభుత్వం అందించిన పింఛన్‌ అర్హులకు చేరలేదని.. దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని కూడా ప్రకటించింది. అలాగే 2024 మే నెల నుంచి నవంబర్ నెల వరకు 7 నెలల పాటు ఉన్న బకాయిని గుడ్ ఫ్రైడే నాడు అందిస్తోంది. ప్రభుత్వ జాబితాలో ఉన్న ఒక్కొక్క పాస్టర్‌ ఖాతాలో రూ.35 వేలు చొప్పున జమ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి రూ.30 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసింది. దీంతో… కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన జగన్‌ పార్టీ నేతలకు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్