ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి ఆర్కే రోజా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇది అలాంటి ఇలాంటి వార్నింగ్ కాదు.. ముట్టుకుంటే మాడిపోతావ్ అంటూ గట్టిగానే హెచ్చరించారు రోజా. ఎన్నికల ముందు ప్రతి రోజు మీడియా ముందు చెలరేగిపోయిన రోజా.. ఓడిన తర్వాత తమిళనాడు షిఫ్ట్ అయ్యారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత నుంచి అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు. ఇక ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడుతో పాటు టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. రోజాను అరెస్టు చేయాలంటే.. జస్ట్ ఒక వారెంట్ చాలు అని రవినాయుడు చేసిన వ్యాఖ్యలు రోజాలో భయం పుట్టించాయనే చెప్పాలి. దీంతో రోజా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
Also Read : విజయసాయి తర్వాత మిథున్ రెడ్డి.. వెంటాడుతున్న సిట్
అయితే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తప్పని పరిస్థితుల్లో ఈ రోజు బయటకు వచ్చారు. తిరుమలలోని ఎస్వీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. అది రుజువు చేస్తానంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ కూడా విసిరారు. ఇందులో భాగంగా ఈ రోజు తిరుమల వెళ్లేందుకు భూమన పిలుపిచ్చారు. దీంతో తప్పని పరిస్థితుల్లో భూమనకు మద్దతు ఇచ్చేందుకు రోజా తిరుపతి వచ్చారు. ఈ సమయంలో రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చి నిరూపించమని టీడీపీ నేతలు ఛాలెంజ్ చేశారని.. వస్తే పోలీసులను అడ్డుపెట్టి ఆపేశారన్నారు. అలాగే టీడీపీ నేతలపైన, పోలీసులపైన ఆడంగి వెధవలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు రోజా.
Also Read : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్
అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్న విషయంపై పవన్ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటూ తిరిగిన పవన్.. ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. ఆయన అన్నకు పదవులు వచ్చిన తర్వాత పవన్ కనిపించటం లేదన్నారు. తిరుమలలో అక్రమాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలుసన్న రోజా.. పవన్ కూడా ఇటీవల రుచి చూశాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. ఎప్పుడూ దేవుడితో పెట్టుకోవద్దని.. దేవుడి విషయంలో అపచారం చేయొద్దంటూ రోజా హితవు పలికారు.