Friday, September 12, 2025 05:19 PM
Friday, September 12, 2025 05:19 PM
roots

రెండు నాల్కల ధోరణిలో సాక్షి.. మార్పు రాదా?

పత్రికలకు ఓ విలువ ఉంటుంది. పాత్రికేయ వృత్తిలో ఉన్న వారికి ఓ నిజాయతీ ఉంటుంది. కానీ సాక్షి పత్రిక విషయంలో అవేవీ ఉన్నట్లు కనిపించటం లేదు. ఇదే విషయం గతంలో పలుమార్లు రుజువైంది కూడా. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ సంపాదనల పునాదుల మీద సాక్షి మొదలైందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా సాక్షి ఆస్తులనే ఈడీ సీజ్ చేసింది. ఇక సీబీఐ అధికారులు కూడా సాక్షిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపైనే జగన్, విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సరైన జవాబు చెప్పలేకపోవడం వల్లే జగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులోనే జగన్ 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు.

Also Read : హమ్మయ్య.. మిథున్ రెడ్డి సేఫ్..!

జరిగింది జరిగినట్లు చెప్పడమే వార్త. అప్పుడే పాఠకులు కూడా ఆయా పత్రికలను పాఠకులు కూడా విశ్వసిస్తారు. సమాజంలో వాటి విలువ కూడా పెరుగుతుంది. కానీ సాక్షి పత్రిక విషయంలో మాత్రం ఆ విశ్వసనీయత లేదనే చెప్పాలి. ఎందుకంటే.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడంతో పాటు.. వైఎస్ కుటుంబాన్ని పొగడటమే ఏకైక అజెండాగా సాక్షి పత్రిక నడుస్తోంది. ఎన్నో తప్పుడు వార్తలు.. మరెన్నో తప్పుడు కథనాలు.. చివరికి సాక్షి పత్రికపై మంత్రి నారా లోకేష్ ఏకంగా రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా కూడా వేశారంటే.. ఆ పత్రిక వార్తల్లో ఎంత విశ్వసనీయత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా తొలుత గుండెపోటు అని సాక్షి పత్రికలో ప్రసారం చేశారు. తర్వాత గొడ్డలి పోటు అని మార్చారు.. ఆ తర్వాత ఈ హత్య చంద్రబాబు చేయించారంటూ కట్టుకథ అల్లేశారు. చివరికి నారాసుర రక్తచరిత్ర అంటూ తప్పుడు కథనం కూడా పత్రికలో ప్రచురించారు.

Also Read : హేమతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వార్తలు రాయడం కూడా సాక్షి పత్రికకే చెల్లింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసినా సరే.. అవి సరైనవే అని.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు పెడితే మాత్రం.. వేధింపులు అంటూ వార్తలు రాసిన పత్రిక సాక్షి. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో ఒకలా.. ఆంధ్రప్రదేశ్‌లో మరోలా వార్తను ప్రచురించి.. పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చింది సాక్షి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పశువేములలో జరిగిన ఓ హత్య వార్తను రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా ప్రచురించిన సాక్షి అభాసుపాలైంది. హరిశ్చంద్ర అనే వ్యక్తిని భూ వివాదాల కారణంగా సొంత అల్లుడే హత్య చేశాడు. ఈ విషయాన్ని సాక్షి తన తెలంగాణ పత్రికలో “సాగర్‌లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య.. భూ వివాదాల కారణంగా అంతమొందించిన అల్లుడు..” అంటూ హెడ్డింగ్ పెట్టి ప్రచురించారు. ఇదే వార్తను ఆంధ్రప్రదేశ్ పత్రికలో మాత్రం.. “పింఛన్ కోసం వస్తే.. పాశవికంగా హత్య.. టీడీపీ గూండాల ఘోరం.. పొలంలోనే వైసీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి..” అంటూ ప్రచురించారు. తెలంగాణ ఎడిషన్‌లో రాజకీయాల గురించి కానీ.. పార్టీల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఏపీ ఎడిషన్‌లో మాత్రం ఇది రాజకీయ హత్య అన్నట్లుగా రాసేశారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక హరిశ్చంద్ర కుటుంబం ఊరు వదిలిపెట్టి పోయిందని.. పింఛన్ కోసం వస్తే హత్య చేశారంటూ తప్పుడు కథనం ప్రచురించారు.

Also Read : కాకాని పారిపోయారా..? కాపాడుతున్నారా..?

ఇలా తప్పుడు కథనాలు ప్రచురించడం సాక్షికి ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో తెలంగాణలో ఒకలా, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ఒకలా ప్రచురించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దాడులు జరిగితే.. అవన్నీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు అన్నట్లుగా కథనాలు రాసిన సాక్షి.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాజకీయ దాడులన్నట్లుగా ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు కీలక బిల్లుల విషయంలో కూడా తెలంగాణ ఎడిషన్‌లో ఒకలా.. ఏపీ ఎడిషన్‌లో మరోలా ఏకంగా ఎడిటోరియల్ పేజీలోనే విశ్లేషణ చేశారు. పాత్రికేయ వృత్తిలో ఈ ద్వంద్వ వైఖరి ఏమిటో సాక్షి యాజమాన్యానికే తెలియాలి. పైగా కేవలం వైసీపీకి మాత్రమే అనుకూలంగా వార్తలు రాస్తూ.. ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ.. ఎదుటి వారిపై ఎల్లో మీడియా అంటూ ఎదురు దాడి చేయడం కూడా సాక్షి సంస్థ ప్రతినిధులకే చెల్లింది. వైసీపీకి అనుకూలంగా వార్తలు రాయడాన్ని ఏమంటారో సాక్షి సంస్థ యజమాని వైఎస్ భారతి చెబితే బాగుంటుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్