రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది సినిమా ఫస్ట్ లుక్.. మాస్ ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఆ రేంజ్ లో నటిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అభిమానులు ఇక నార్మల్ ఆడియన్స్ కు కూడా రామ్ చరణ్ లుక్ తో పాటుగా ఫస్ట్ లుక్ టీజర్ లో క్రికెట్ ఆడే ఓ షాట్ బాగా ఆకట్టుకుంది. గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
Also Read : హిట్ 3 క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్..?
ఆ సినిమా ప్రమోషన్స్ కంటే కూడా ఈ సినిమా షూటింగ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న సమయంలోనే మైసూర్లో షూటింగ్ మొదలుపెట్టాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమా ఖచ్చితంగా హిట్టు కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక ఓ సెంటిమెంట్ కూడా ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువ.
Also Read : హేమతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు..!
2000 లో వచ్చిన లగాన్ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్ది లుక్ చూస్తుంటే పక్కాగా లగాన్ సినిమా రేంజ్ లో ఉండబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాకు కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పలువురు క్రికెటర్ల జీవిత కథలపై కూడా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. దీనితో పెద్ది సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందంటూ.. మెగా ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక నటన పరంగా కూడా రామ్ చరణ్ దుమ్మురేపుతాడని.. మరోసారి రంగస్థలం రేంజ్ లో రామ్ చరణ్ ను చూడవచ్చు అంటూ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.