Friday, September 12, 2025 11:07 PM
Friday, September 12, 2025 11:07 PM
roots

పంత్ మెడపై కనపడని కత్తి

ఐపీఎల్ సీజన్ ఏమో గాని అభిమానులు అలాగే యాజమాన్యాల హడావుడి వేరే లెవెల్ లో ఉంటుంది. భారీ ధరకు కొన్న ఆటగాళ్లు అలాగే ఎక్కువ వంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లపై అభిమానులతో పాటుగా యాజమాన్యాలు కూడా ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటాయి. అయితే ఇప్పుడు అభిమానులకు కొంతమంది ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు. ఇటీవల కలకత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కీలక సమయంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సమర్థవంతంగా పరుగులు చేయలేకపోవడంతో అతని అనవసరంగా 23 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని విమర్శించారు అభిమానులు.

Also Read : జైస్వాల్ – రహానే మధ్య గొడవలు పీక్స్ కు

ఇక ఇదే జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లపై కూడా కొంతమంది విమర్శలు చేశారు. గుజరాత్ టైటాన్స్ తో పాటుగా ముంబైలో ఉన్న కీలక ఆటగాళ్లపై కూడా ఇదే విమర్శలు వచ్చాయి. ఇక లక్నో జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రిషబ్ పంత్ పై అభిమానులతో పాటుగా జట్టు యాజమాన్యం కూడా ఆగ్రహంగానే ఉంది. అతన్ని 27 కోట్లు ఖర్చు చేసి లక్నో యాజమాన్యం కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు అతని నుంచి ఆశించిన స్థాయిలో ఇన్నింగ్స్ ఒకటి కూడా రాలేదు.

Also Read : ఏఐతో నెలకు లక్షన్నర సంపాదిస్తున్నాడు

అంతర్జాతీయ క్రికెట్లో తాను ఏంటి అనేది నిరూపించుకున్న పంత్.. ఐపీఎల్ సీజన్లు మాత్రం పరుగులు చేయడానికి నానా కష్టాలు పడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో కూడా పేలవ ప్రదర్శన చేశాడు. అయితే అతనిపై 27 కోట్ల కత్తి మెడపై ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తనపై భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఒత్తిడిలో ఉన్నాడని.. సారధ్య బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆటగాడిగా మాత్రం అతను నిరూపించుకోలేకపోతున్నాడని.. దీనికి కారణం అతను పై ఉన్న 27 కోట్ల ట్యాగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా తనపై విమర్శలు వచ్చిన సమయంలో పంత్ ఆట తీరుతో సమాధానం చెబుతాడు. టెస్ట్ క్రికెట్లో తాను ఏంటి అనేది ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు టి20 క్రికెట్లో విమర్శలు రావడంతో పంత్ ఒత్తిడిలో ఉన్నట్టుగానే అర్థమవుతుంది. అటు లక్నో యాజమాన్యం కూడా అతనిపై ఒత్తిడి పెంచే విధంగానే మాట్లాడటంతో దూకుడుగా ఆడలేక పోతున్నాడు. మరి రాబోయే మ్యాచ్లో అతను ఏ విధంగా ప్రదర్శన చేస్తాడు అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్