Friday, September 12, 2025 10:57 PM
Friday, September 12, 2025 10:57 PM
roots

మొన్న పెద్దిరెడ్డి.. నేడు కేతిరెడ్డి.. దొరికినట్లేనా?

వైసీపీ నేతల అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున వైసిపి నేతలు ఆక్రమించుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. టిడిపి నేతలు పలు మీడియా సమావేశాల్లో ఆధారాలతో సహా మాట్లాడారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారాలపై అప్పట్లో ఆయన గట్టిగానే మాట్లాడారు. ప్రజలు కూడా ఇప్పటికే వైసీపీ నాయకుల అవినీతి, భూ కబ్జాల మీద చాలా సమాచారం ప్రజా దర్భార్ లో పార్టీ నాయకులకి అందించారు.

Also Read : ఎస్.. రెడ్ బుక్ కోసమే పోలీసులు పని చేస్తారు

రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటుగా పలువురు కీలక నేతలు ప్రభుత్వ భూములను, అటవీ భూములను ఆక్రమించుకున్నారని అప్పట్లో టిడిపి ఆరోపించింది. ఇటీవల పెద్దిరెడ్డికి సంబంధించిన పలు అక్రమాలపై సాక్షాలను కూడా బయటపెట్టారు. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా అది అటవీ భూమేనని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్రమాలపై కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు చేసి వదిలేయడమే కాకుండా ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. గుర్రాల కొండలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆయన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read : ఆ జెండా మాదే.. వదిలేది లేదు..!

తాజాగా దీనిపై అధికారులు ఫోకస్ పెట్టి.. ఫామ్ హౌస్ ను సీజ్ చేసి, స్వాధీనం చేసేందుకు వెళ్లారు. అయితే గేటుకు తాళం వేసి ఉండటంతో అధికారులు వెనక్కి తిరిగి వచ్చేసారు. దీనిపై ఆయన మీద కేసు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. పాదయాత్ర సమయంలో నారా లోకేష్ దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. దీనికి అప్పట్లో వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అలాగే ఆయన రైతులను కూడా నీటి విషయంలో ఇబ్బంది పెట్టి.. ఒక చెరువు కోసం ఆ నీటిని మళ్లించుకున్నారు అనే ఆరోపణలు సైతం వచ్చాయి. దీనికి సంబంధించిన పలు ఫోటోలను కూడా టిడిపి రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు గుర్రాల కొండ భూముల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్