ఏపీ లిక్కర్ స్కాం లో సంచలనాలు నమోదయ్యే సంకేతాలు కనపడుతున్నాయి. లిక్కర్ స్కాంపై పార్లమెంట్లో ఎంపీ లావు కృష్ణదేవరాయులు చేసిన వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల అభిప్రాయపడుతున్నాయి. ఇక ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంతో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కాం చాలా పెద్దదని టిడిపి ఆరోపిస్తోంది. అర్థం పర్ధం లేని బ్రాండ్లతో గత ఐదేళ్లపాటు ఏపీలో 99 వేల కోట్ల మధ్య అన్ని విక్రయించారని ఆయన ఆరోపించారు.
Also Read : ఎస్.. రెడ్ బుక్ కోసమే పోలీసులు పని చేస్తారు
అలాగే డిజిటల్ పేమెంట్స్ కూడా లేవని టిడిపి ఆరోపించింది. క్యాష్ పేమెంట్స్ మాత్రమే ఏపీ వ్యాప్తంగా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంట్లో ఇదే అంశాన్ని ఎంపీ లావు కృష్ణదేవరాయులు లేవనెత్తారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనిపై నివేదిక అడిగి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉండవచ్చు అనే దానిపై కూడా అమిత్ షా ఎంపీని పలు వివరాలు అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ఇదే కారణమని ఆరోపణలు ఉన్నాయి.
Also Read : మళ్ళీ వార్తల్లో సెంటినల్ తెగ.. అసలేం జరిగింది..?
ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఎంపీ మిధున్ రెడ్డి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయగా కోర్టు డిస్మిస్ చేసింది. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే డిమాండ్ లు ఉన్నాయి. దీనితో ముందు జాగ్రత్తగా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు మిథున్ రెడ్డి. ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయడంతో మిథున్ రెడ్డితో పాటుగా వైసీపీ నాయకత్వం సైతం ఆందోళనలో కనపడుతోంది.