Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

ఎమ్మెల్సీ దువ్వాడ.. డాక్టరేట్‌లో నిజమెంత?

రోజూ వార్తల్లో నిలిచే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి చర్చంతా ఆయనకు వచ్చిన గౌరవ డాక్టరేట్‌పైనే. దువ్వాడకు డాక్టరేట్‌ ఇవ్వడమే కాదు, ఆయనకు ఇచ్చిన యూనివర్సిటీ విషయంలోనూ వివాదం నడుస్తోంది. తాను చేసిన సేవలకు గుర్తింపుగానే డాక్టరేట్‌ ఇచ్చారని శ్రీనివాస్‌ చెబుతుండగా.. వర్సిటీకి గుర్తింపు లేని విషయం వెలుగులోకి వచ్చింది. దువ్వాడకు ‘డే స్ప్రింగ్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ’ డాక్టరేట్‌ ఇచ్చిందని.. అలాగే ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు చేతుల మీదుగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ దక్కిందంటూ వైసీపీ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. తానంటే గిట్టని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని… డాక్టరేట్ తనకు రావడంపై చాలా మందికి అసూయగా ఉందన్నారు.

Also Read : నీ తాట తీస్తా.. రెచ్చిపోయిన దువ్వాడ..!

గ్రానైట్‌ బిజినెస్‌లో తాను చేసిన సేవలు, సమాజం కోసం నీతి, నిజాయితీగా చేస్తున్న ఉద్యమాలు, రాజకీయాలను చూసి గౌరవ డాక్టరేట్‌ వచ్చినట్లు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఎపిటోమ్‌ స్టేట్‌ అకాడమీకి అనుబంధమైనదిగా డే స్ప్రింగ్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ వైబ్‌సైట్‌ సూచిస్తోంది. ఇదొక క్రిస్టియన్‌ మతప్రచార సంస్థ. మతపరమైన డిగ్రీ, పీజీ, డాక్టరేట్‌ కోర్సులు అందిస్తున్నట్లుగా వెబ్ సైట్‌లో ఉంది. ఈ యూనివర్సిటీ హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్లో ఉన్న అమృతవాణి కమ్యూనికేషన్‌ సెంటర్‌ నుంచి పని చేస్తున్నట్లుగా ఉంది. అయితే, అక్కడ ఎలాంటి యూనివర్సిటీ లేదనేది మీడియా పరిశీలనలో తేలింది. ఆ భవనంలో క్రైస్తవ మత ప్రచారానికి చెందిన సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి.

Also Read : ఇది తెలుసా: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే

దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టర్‌ ఇన్‌ సోషల్‌ సర్వీసెస్‌ (డాక్టరేట్‌) ఇచ్చినట్లు వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఇండో – ఇజ్రాయెల్‌ ఫ్రెండ్‌షిప్‌ అసోసియేషన్‌ వార్షిక ఈవెంట్‌ సందర్భంగా డాక్టరేట్‌ ఇచ్చినట్లు వివరించారు. ఆయన చేసిన సేవను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డాక్టరేట్‌ కోసం ఎంపిక చేశామన్నారు. వాస్తవానికి గత ఆగస్టులో దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంలో వివాదం తలెత్తింది. ఆయన భార్య వాణి, కుమార్తెలు హైందవి, నవీనలు దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి ముందు నిరసనకు దిగారు. కొత్తగా నిర్మించిన ఇంటిలో దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారని.. నిరసన చేపట్టారు. దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని వాణి ఆరోపించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Also Read : ఎన్టీఆర్ పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అయితే డే స్ప్రింగ్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ గుర్తింపు విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. యూనివర్సిటీ ఎక్కడా నమోదు కాలేదు. ప్రైవేట్‌ అటానమస్‌ థియోలజికల్‌ యూనివర్సిటీ కనుక ఎలాంటి గుర్తింపు అవసరం ఉండదంటున్నారు వర్సిటీ ప్రతినిధులు. వర్సిటీ కార్యకలాపాలన్నీ అమెరికా నుంచి నడుస్తాయని, ఇక్కడ అనుమతులు అవసరం లేదని తెలిపారు. డాక్టరేట్‌ దక్కడంపై దువ్వాడ శ్రీనివాస్‌ స్పందన మరోలా ఉంది. మార్చి 21న తనకు యూనివర్సిటీకి వెళ్లే వరకు డాక్టరేట్ ఇస్తున్నట్లు తనకు తెలియదన్నారు. ఇదే యూనివర్సిటీ గతంలో శ్రీనివాస్ గౌడ్, బలరాం నాయక్ వంటి వారికి కూడా డాక్టరేట్ ఇచ్చినట్లు తెలిపారు. అలాంటిది ఫేక్ వర్సిటీ ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే వేదికపై దువ్వాడతో పాటు దివ్వెల మాధురరి కూడా ఉండటంపై సోషల్ మీడియాలో విచిత్రమైన కామెంట్లు వస్తున్నాయి.

Also Read : ఐఏఎస్ అయిన ఐటీ ఎంప్లాయ్.. గూగుల్ లో జాబ్ వదిలేసి మరీ…!

ట్రంప్ స్పిరిచ్యువల్ అడ్వైజర్ మార్క్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నట్లు దువ్వాడ తెలిపారు. అయితే మార్క్ బర్న్స్ క్రైస్తవ మత ప్రచారకుడని వెల్లడైంది. ఆయన ట్రంప్‌ సలహాదారు కాదని కూడా తెలుస్తోంది. అసలు డాక్టరేట్‌ను రీసెర్చ్.. లేదా విశేష సేవలందించిన వారికి మాత్రమే ఇస్తారు. అది కూడా స్నాతకోత్సవం సమయంలో ఇస్తారు. కానీ దువ్వాడ విషయంలో మాత్రం రెండు కాదు.. ఏ విషయంలో రీసెర్చ్ చేశారో తెలియదు.. అసలు దువ్వాడ చేసిన సేవలేమిటో కూడా ఎవరికీ తెలియదు. ఆయన చరిత్ర తీసుకుంటే.. దాడులు, బూతులే కనిపిస్తాయి. మరి ఆయన చేసిన సేవ ఏమిటీ అంటే.. దివ్వెల మాధూరికి చేస్తున్నందుకా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Also Read : రెండో మ్యాచ్ కు అయినా రాహుల్ వస్తాడా…?

యూనివర్సిటీ హోదా గానీ, గుర్తింపు గానీ లేకుండా ఇచ్చే గౌరవ డాక్టరేట్లకు ఎలాంటి గుర్తింపు, విలువా ఉండదు. డే స్ప్రింగ్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ప్రైవేటు థియోలజికల్‌ యూనివర్సిటీగా నిర్వాహకులు చెబుతున్నారు. యూజీసీ నుంచి గుర్తింపు లేకుండా ‘యూనివర్సిటీ’ అనే పేరు వాడుకోవచ్చా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికి తప్పనిసరిగా యూజీసీ గుర్తింపు ఉండాల్సిందే. అలా కాకుండా ఏర్పాటైన ఏ సంస్థ అయినా సరే ‘ఫేక్‌ యూనివర్సిటీ’లుగానే యూజీసీ గుర్తిస్తుంది. డే స్ప్రింగ్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీకి యూజీసీ నుంచి గానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి గుర్తింపు లేదు. మరి ఫేక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌కు గుర్తింపు ఎలా ఉంటుందో తీసుకున్న వైసీపీ ప్రజా ప్రతినిధి దువ్వాడ శ్రీనివాస్ అయినా చెప్పాలి… లేదా ఆహో ఓహో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఆ పార్టీ అభిమానులైనా చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్