Saturday, September 13, 2025 12:07 AM
Saturday, September 13, 2025 12:07 AM
roots

‘పెద్ది’ లుక్ పై సోషల్ మీడియాలో రచ్చ

మెగా హీరో రామ్ చరణ్ ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ తో తనని తాను రుజువు చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా మంచి హిట్ అవలేదు. ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వగా భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా దారుణంగా నిరాశ పరిచింది అని చెప్పుకోవచ్చు. దీనితో రామ్ చరణ్ తో పాటుగా అతని అభిమానులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వేరే హీరోలను పదేపదే ట్రోల్ చేసే మెగా అభిమానులు రామ్ చరణ్ సినిమాలు హిట్ అవ్వకపోవడంతో.. సోషల్ మీడియాలో ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు.

Also Read: ఒక్క ఫోటోతో ఉద్యోగం ఊడిందా..?

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు ఏవి ఈ మధ్యకాలంలో హిట్ అవ్వలేదు. అల్లు అర్జున్ సినిమా తప్పించి మిగిలిన హీరోల సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంచితే.. ప్రస్తుతం రాంచరణ్.. బుచ్చిబాబు డైరెక్షన్లో.. ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో ఎలాగైనా సరే స్టార్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలని తాపత్రయపడుతున్నాడు. అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పై మెగా అభిమానులు పెదవి విరుస్తున్నారు.

Also Read: ఇంగ్లాండ్ తో సీరీస్ కు ముందు రోహిత్ సంచలనం

పుష్ప 2 లుక్ మాదిరిగానే ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గట్టిగానే వస్తుంది. ముక్కుపుడక మినహా మిగిలింది మొత్తం అలాగే ఉంది. దీనిపై ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ను మెగా అభిమానులు ఎంత ట్రోల్ చేసినా మెగా హీరోలు అతన్ని ఫాలో అవ్వాల్సిందే అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మాస్ ఆడియన్స్ కోసం రామ్ చరణ్ కష్టపడుతున్నాడని.. కానీ ఫస్ట్ లుక్ లో అంత కొత్తదనం ఏమీ లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. దానికి తోడు రామ్ చరణ్ కు హిట్ ఇవ్వడానికి సుకుమార్ కూడా కష్టపడుతున్నాడని.. పెద్ది సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు అంటూ సెటైర్లు వేస్తున్నారు. అందుకే సుకుమార్ పుష్ప సినిమా లుక్ దింపేశాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్