Saturday, September 13, 2025 02:38 AM
Saturday, September 13, 2025 02:38 AM
roots

బీజేపీకి విజయసాయి రెడ్డి ఆఫర్ వెనుక కారణం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం వ్యవహారంలో పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు ఎంపీ లావు కృష్ణదేవరాయలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షావద్ద ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి. విదేశాలకు నిధులు తరలించే విషయంలో విజయ్ సాయి రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారని అంశాన్ని సాక్షాలతో సహా అమిత్ షా వద్ద ఉంచినట్లు తెలుస్తోంది.

Also Read : పోలవరంపై చంద్రబాబు కీలక ప్రకటన

ఇక విజయసాయిరెడ్డి పై ఈడీ విచారణ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని అలాగే మనీ లాండరింగ్ వ్యవహారంలో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వచ్చాయి. అసలు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం లిక్కర్ వ్యవహారమే అనే అంశాన్ని హోం మంత్రి వద్ద లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించారట. ఇక మీడియాకు విజయసాయిరెడ్డి పేరు నేరుగా వెల్లడించకుండా పరోక్షంగా ఆయన పేరుని బయటపెట్టారు. విజయ సాయి రెడ్డి విషయంలో ఇప్పటికే ఈ డి అధికారులు దూకుడుగా ఉన్నారు.

Also Read : వైసీపీకి గ్రోక్ షాక్.. ఏం చెప్పిందంటే..

కాకినాడ పోర్టు వాటాల విషయంలో ఆయనతో పాటుగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అనుసరించిన వైఖరి పై ఈడీ అధికారులు దృష్టి పెట్టి ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ సమయంలో లిక్కర్ మాఫియా వ్యవహారం కూడా పార్లమెంట్ వేదికగా లావు కృష్ణదేవరాయలు బయట పెట్టడంతో విజయసాయిరెడ్డి.. ఇప్పుడేం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే తనను తాను రక్షించుకునేందుకు బిజెపిలో చేరి ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందిస్తానని ఆయన చెప్పినట్లుగా కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు కీలక నేతలతో పాటుగా ఆయన కూడా బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకే విజయసాయిరెడ్డి బిజెపికి ఆఫర్ ఇచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్