Friday, September 12, 2025 09:22 PM
Friday, September 12, 2025 09:22 PM
roots

నాగబాబుకు ఇచ్చే శాఖలు ఇవేనా..?

ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే క్యాబినెట్లో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎంట్రీపై కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో టిడిపి జనసేన పార్టీలో ఇప్పటికే అధికారిక ప్రకటన చేయడంతో నాగబాబు ఎప్పుడు క్యాబినెట్లో అడుగు పెడతారు అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నాగబాబుకు మార్చి నెలలో క్యాబినెట్ పదవి ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అధికారికంగా మీడియా ముందు చెప్పారు. దీనితో నాగబాబు కచ్చితంగా ఈ నెలలో ఏదో ఒక శాఖలో మంత్రిగా క్యాబినెట్ లో అడుగుపెట్టడం ఖాయమని జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భావించారు.

Also Read : బాబు మంత్రివర్గం లోకి ఎవరు ఇన్.. ఎవరు ఔట్..?

అయితే పలు కారణాలతో నాగబాబు చేరిక వాయిదా పడుతూ వస్తోంది. చివరకు ఏప్రిల్ నాలుగో తేదీన ఆయనను క్యాబినెట్ లోకి తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే ఆయనకు రెండు శాఖలు అప్పగించేందుకు కూడా ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జనసేన మంత్రి వద్ద ఉన్న పర్యాటక శాఖను నాగబాబుకు ఇవ్వనున్నారు. అదేవిధంగా టిడిపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వద్ద ఉన్న క్రీడా శాఖను కూడా ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు శాఖల విషయంలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది.

Also Read : కొడాలి నాని గుండెకు ఏమైందంటే..!

కొత్త మంత్రి కాబట్టి ఇబ్బంది ఉండదు అనే భావనలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఇద్దరు మంత్రులకు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు సమాచారం పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ రెండు శాఖలతో పాటుగా మరో శాఖ కూడా ఆయనకు అప్పగించే అవకాశం ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక బెర్త్ ఖాళీగా ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కూడా పలు శాఖలు ఉన్నాయి. వాటిలో ఒకటి నాగబాబుకు ఇవ్వచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్