Saturday, September 13, 2025 02:42 AM
Saturday, September 13, 2025 02:42 AM
roots

30 ఏళ్ల తర్వాత చర్చ.. రియల్ విజనరీ..!

“అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు..” ప్రముఖ దర్శక, రచయిత త్రివిక్రమ్ చెప్పిన మాటలు. ఖలేజా సినిమాలో మహేశ్ బాబును ఉద్దేశించి రావు రమేష్ చెప్పే డైలాగ్. ఇది నీ దర్శనం.. ఇదే నిదర్శనం.. అంటూ చెప్పిన డైలాగ్.. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పినప్పుడు ఎన్నో సవాళ్లు.. ఎన్నో ఆటంకాలు.. ఆ సమయంలో ఆయన చూపిన చొరవ.. తీసుకున్న నిర్ణయాలు.. తీసుకువచ్చిన సంస్కరణలు.. అప్పట్లో అందరినీ ఇబ్బంది పెట్టాయి.. విసిగించాయి.. నవ్వించాయి.. ఇంకా చెప్పాలంటే.. ఓడించాయి కూడా. కానీ సరిగ్గా 30 ఏళ్ల తర్వాత వాటి ఫలితాలు ఇలా ఉంటాయా అని అంతా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఇదే విషయాన్ని అటు బ్యూరోక్రాట్లు, ఇటు కార్పొరేట్ దిగ్గజాలే కాదు.. ఇప్పుడు సోషలిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు.

Also Read : వివేకా హత్య కేసు.. ఇంతకీ అజ్ఞాత వ్యక్తి ఎవరు..?

ఓ విజన్.. ఓ ప్లానింగ్.. అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబుతో రావు రమేష్ చెప్పిన డైలాగ్ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు చేసిన విజన్… దాని అమలు కోసం తీసుకున్న నిర్ణయాలు.. ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. సంపద సృష్టి అనేది చంద్రబాబు ఎప్పుడు చెప్పే మాట. ఈ మాట అన్నప్పుడల్లా.. నోట్లు ముద్రిస్తారా అంటూ విపక్షాలు ఎద్దేవా చేసేవి. కానీ అవేవి పట్టించుకోలేదు చంద్రబాబు. సంక్షేమ పథకాలు అందిస్తే చాలు అనేది విపక్షాల మాట. కానీ.. ఇలా ఎంతకాలం ఎంత మందికి ఉచితాలివ్వాలి.. ప్రతి ఒక్కరిని సంపన్నులుగా చేయాలనేది చంద్రబాబు మాట. అలా చేయాలంటే ఆర్థిక చేయూత కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి చూపించాలి. డబ్బు వినియోగాన్ని పెంచాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనీ సర్క్యూలేట్ చేయాలనేది చంద్రబాబు మాట.

Also Read : వణికిస్తున్న లావు.. వైసీపీలో అలజడి

ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిన రోజు… సంపద కూడా పెరుగుతుందనేది చంద్రబాబు ఆలోచన. ఇందుకు ఆయన ఎంచుకున్న రంగం పర్యాటకం. రెండు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన అంశంపై చర్చ జరిగింది. సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ప్రస్తావించిన అంశం చంద్రబాబు విజన్‌ను గుర్తు చేసింది. తెలంగాణను టూరిజం హబ్‌గా చేయవచ్చు అని వ్యాఖ్యానించారు. “ఏ ఇజం లేదు.. టూరిజమే అని చంద్రబాబు అప్పట్లో అన్నప్పుడు మాకు కోపం వచ్చేది.. మాకు కోపం వచ్చేది. కానీ నిజంగా ఖర్చులేని ఇజం ఏదైనా ఉందంటే.. అది టూరిజమే” అని కూనమనేని వ్యాఖ్యానించారు. అయితే ఇదే విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గుర్తు చేశారు. “అప్పట్లో ప్రతిరోజు టూరిజం గురించే ప్రమోట్ చేసేటప్పుడు అడ్డుపడుతుంటే.. కమ్యూనిజం లేదు.. క్యాపిటలిజం లేదు.. సోషలిజం లేదు.. ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్.. ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్.. అందరూ అనుసరించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేసినప్పుడు.. కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు.

Also Read: కుక్కల ఫుడ్ తినేశారు.. పెట్రోల్ తాగేశారు.. వైసీపీ హయాంలో కొత్త రకం అవినీతి

చాలా దేశాల్లో కమ్యూనిజం ఉంటే.. ఎలా లేదంటారన్నారు. కాదు.. సంపద, పేదరిక నిర్మూలనే వస్తుందని ఆ రోజే చెప్పాను.” అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. అలాగే కూనమనేని చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. “నేను చెప్పింది 30 ఏళ్లు పట్టింది అర్థం చేసుకోవడానికి… మీకు కూడా అలా 30 ఏళ్లు పడితే సమస్యలు వస్తాయి” అంటూ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూనమనేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాడు విజన్ 2020 అంటే అంతా ఎద్దేవా చేశారు. మరి ఇప్పుడేమంటారు అంటూ కూనమనేని చేసిన వ్యాఖ్యాలను ప్రస్తావిస్తున్నారు. అందుకే గ్లోబల్ లీడర్ చంద్రబాబు రియల్ విజనరీ అని అంటారంటూ పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్